* దాతెవరు....!? * కోరాడ నరసింహా రావు !

 శ్రమ  చిగురించింది.... 
   రైతు శ్రమ ఫలిస్తోంది... !
అకాలంలో  కాక సకాలంలో... 
   వర్షాలు పడినపుడే...., 
చీడ - పీడలు  పట్టి.... 
    పీడించ నపుడే...., 
నిండైనకంకులతో, పుష్కలంగా 
    పంట పండినపుడే..., 
 గిట్టుబాటు ధర చేతికి.... 
   వచ్చినపుడే....., 
 చేసిన అప్పులు తీరి.... 
    నాలుగు గింజలు గాదెలో... 
        మిగిలినపుడే...., 
  అపుడే...రైతుకు కాస్త ఊరట!
  మనసుకొకింత ప్రశాంతత !!
 మరుసటేటి వ్యవసాయానికి
ఉత్సాహపు ఎదురుచూపులు.
    యే విషయం నిరుత్సాహ పరచినా... ఇంకెక్కడి రైతు !?
  వ్యవసాయం వదలి... 
    వలసకూలీ గా మారితే.... 
        ఈ ప్రపంచానికిక ..  ... 
            దిక్కెవరు.... !?
    అన్నం పెట్టే  దాతెవరు... ?!
        ******
కామెంట్‌లు