గమ్యం చేరేవరకూ... @ కోరాడ నరసింహా రావు
ప్రకృతికి ఆలంబన యైన.... 
   ఆకాశమే  హద్దుగా.... 
     ఆడపిల్ల ప్రస్థానం.... !

అడుగడుగు అడ్డంకులతో.... 
  సమాజ వికృత చేష్టల.... 
     అవరోధం.... !!

ఈ నాటి ఈ  స్థితికి..... 
   ఎన్నెన్ని యుద్దాలు చేసిందని 
ఎన్నెన్ని అవమానాలు.... 
            భరించిందని...., 

ఓర్పు - సహనాల ప్రతి రూపమే 
    కదా  ఈమె... !
కనుకనేవిజయాలుసాధించింది
అత్యున్నత శిఖరాల నధిరో హించింది !!
 
ఐనా... గుర్తించం !  అమ్మత నాన్ని  గౌరవించం !!
   ఆరాధించాల్సింది పోయి.... 
     అవహేళన చేస్తున్నాం !

ఎన్నెన్ని అడ్డంకులెదురైనా.... 
అపహాస్యాలు వెక్కిరించినా... 
ఆమెది ముందడుగే.. వెనుకను పట్టించుకోదు... !
   లక్ష్యం నెరవేరేదాకా..... 
      గమ్యం చేరేవరకూ.... !!

కామెంట్‌లు