వాదం పెంచకు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు బడి అంతా హడావిడి  సందడి!కరోనా తర్వాత  సాఫీగా తెరవబడిన బడులతో కొత్త సందడి ! కొత్తగా చేరిన పిల్లలు బిక్కమొహాలతో ఉంటే పాత పిల్లలు చిలోపొలో అంటూ కిలకిలలాడుతున్నారు.కొత్త గా చేరిన హరి లత బిక్కమొహాలతో అందరినీ చూస్తున్నారు. పక్క పక్కనే ఇళ్లు! కరోనా కాటుకి  హరితల్లి లతనాన్న  బలైనారు. ఇద్దరు ఓబట్టలు కుట్టే షాపు లో  పనిచేస్తున్నారు. రోజు పిల్లల ని ఫర్లాంగుదూరంలో ఉన్న  బడికి  వారిద్దరిలో ఒకరు దింపుతారు. 10కల్లా షాపు కెళ్లితే రాత్రి 7దాకా నడుం తల వంచి కుట్టాల్సిందే! కొత్త పిల్లలని టీచర్లు పరిచయం చేసుకుని వారి లో బెరుకు పోగొట్టారు.4వక్లాస్లో చేరిన లత హరిని క్లాస్ కి పరిచయం చేస్తూ టీచర్ ఇలా అన్నారు"పిల్లలూ!మీకు ఇంట్లో ఉండి బోర్ కొట్టింది. కొంతమంది జీవితంలో పెనుమార్పులు వచ్చాయి.ఈఇద్దరు పిల్లల బాధ్యత  క్లాస్ మొత్తానిది! వీరికి కావలసిన పుస్తకాలు మాటీచర్లం ఇస్తాం.వీరికి తెలీనివి చెప్పే బాధ్యత అందరూ పంచుకోవాలి.సరేనా?" అలాగే అని తలూపారు.వారం గడిచింది. ఆరోజు  లత తల్లి తో కలిసి హరి లత బడికి వెళ్తుంటే జోరుగా వచ్చిన  ఓస్కూటర్ పిల్లలని గుద్దేసింది.లత హరికి పెద్దగా దెబ్బలు తగల్లేదు కానీ లత తల్లి  భయంతో కెవ్వుమంది.జనం పోగైనారు.స్కూటర్ పై ఇద్దరు కె.జి.తమబడి పిల్లలే ఉన్నారు. యూనిఫాం వల్ల వారిని  గుర్తించారు. "అమ్మా!క్షమించాలి!నేను కరోనా బారిన పడి కోలుకుంటున్నాను.ఫ్యాక్టరీ కి టైంకి వెళ్లకపోతే అక్కడ పనివారు సరిగా రారు.వారికి జీతాలు ఇచ్చేరోజు!నాకూ యజమాని తో మాటవస్తుంది.పిల్లలని నేను దింపుతా"అని హరిని లతని ఎక్కించుకున్నాడు.అతనితో వాగ్వాదం చేసి  తిడదామని వచ్చిన వారు లత తల్లి మాటతో అలా నిలబడ్డారు "బాబూ!మీ టెన్షన్ మీది!కావాలని మీరు టక్కరు కొట్టలేదుగదా?అనవసర లొల్లి వల్ల అందరికీ ఆలస్యం  మనసు బాధ పడటం తప్ప ఏమీ ఉండదు. "ఆమె దొడ్డ బుద్ధిని మెచ్చుకుంటూ అందరూ కదిలారు.రోజూ  అతను  లత హరిని  తనపిల్లలతో పాటు బండీపై తీసుకుని వెళ్లి దింపుతున్నాడు.ఒకేఒక్క నిముషం  మనం నోరు  మెదపకుండా ఉంటే కొట్లాటలు రావు.రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు!ఆవేశంతో అనర్ధాలు జరుగుతాయి సుమా🌹


కామెంట్‌లు