సమయం లేదు మిత్రమా (మణిపూసలు );-ఎం. వి. ఉమాదేవి
రచనలకే సమయమేది 
రాసుకున్న పొత్తమేది 
వేల వేల భావాలకు 
మనసులోన కుదురుయేది !? 

విమర్శలకి అర్థమేది 
వివేకాన పలుకుయేది 
వెలుగులీను అక్షరముకు 
కవిత్వాన విలువయేది !? 

ప్రకృతికిచట ఊతమేది 
సరి  వాతావరణమేది 
వచ్చిపోవు బంధువులను 
ఆదరించు ప్రేమ మేది !? 

ఒక విషయం చర్చ యేది 
సమంజసం మాట యేది 
స్వార్థం సవారీ లో 
సానుభూతి వచనమేది !? 

దారుణాల కడ్డుయేది 
గట్టెక్కెడి ఒడ్డు యేది 
వ్యక్తి పూజ వ్యసనమయ్యె 
శక్తి నిచ్చు స్నేహమేది? 


కామెంట్‌లు