వాల్మీకి మహర్షి వ్యాసమహర్షి భారతదేశంలో పుట్టి ఉండకపోతే సాహిత్యరంగంలో ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా ఉండేది కాదు. ధర్మాన్ని గురించి వాల్మీకి, న్యాయాన్ని గురించి వ్యాసుడు చెప్పారు. వాల్మీకి రాముని చరిత్ర వ్రాస్తే వ్యాసుడు కురుపాండవ చరిత్రలో శ్రీకృష్ణుని గురించి ప్రస్తావిస్తూ జీవితంలో న్యాయాన్ని ఎలా ఆచరించాలో వ్రాశాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎలా పొందుతామో వారు ఇచ్చిన మాటను కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని శ్రీరామచంద్రమూర్తి అడవుల పాలైనా అక్కడ మహర్షులకు రక్షణగా నిలిచాడు. ప్రజా కంటకుడైన రావణాసురుని పొగరు అణచి ప్రాణాలు తీశాడు. మనిషి ధర్మాన్ని ఆచరించాలంటే శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరికి బోధ చేసాడు వాల్మీకి. కనుకనే ఎన్ని వేల సంవత్సరాలు అయినా వారి పేరు స్మరించుకుంటూనే ఉన్నాం రఘు వంశపు పరువు నిలిపిన వాడు రాముడని అంటున్నాము. రఘువంశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వాడు ఆయన. వ్యాసమహర్షి అహంకారాన్ని శిక్షించడానికి రాజకీయ నాయకుడైన దుర్యోధనుని తత్వాన్ని ప్రజలకు అందించారు. తన సోదరులు వందమందిని చూసుకొని ఆ గర్వంతో అధికారాన్ని చెలాయించి అందరినీ చులకన చేశాడు. తన కొలువు కూటంలో ప్రపంచానికే ఆదర్శప్రాయమైన పతివ్రతామతల్లి ద్రౌపదిని వివస్త్రను చేయడానికి ప్రయత్నం చేశాడు. అతని కుటిల బుద్ధి అరాచకాన్ని వారి స్నేహితులు వ్యతిరేకించినా మూర్ఖంగా ప్రవర్తించాడు. మనం మంచి చేస్తే ఎలా పొగడ్తలు అందుకుంటామో చెడు చేస్తే తెగడ్తలను కూడా భరించవలసి వస్తుంది. దీనిని సామాన్య ప్రజలకు తెలియజేయడానికి వేమన తన పద్యం ఎంతందంగా కూర్చాడో చూడండి.
"రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులము జెరచె
ఇలను బుణ్యపాపమీలాగు కాదొకొ.."
"రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులము జెరచె
ఇలను బుణ్యపాపమీలాగు కాదొకొ.."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి