సుభాషితాలు;--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
రవి రీతిని వెలుగుదాం
నిజమెప్పుడు పలుకుదాం
జయ గీతం పాడుదాం
మన గౌరవం నిలుపుదాం

గగనమంత ఎదుగుదాం
పరపతిని పెంచుదాం
విపులంగా చెప్పుదాం
కరము లెత్తి  మ్రొక్కుదాం

విముక్తి బాట సాగుదాం
విజయాన్ని పొందుదాం
దయ కల్గి  బ్రతుకుదాం
ప్రముఖుల చెలిమి కోరుదాం


కామెంట్‌లు