తల్లి దండ్రులకు దినోత్సవాలు కాదు,...ప్రేమాభిమానాలు కా వాలి! కోరాడ నరసింహా రావు.

 తండ్రి నాటిన విత్తును... తల్లి తనక్షేత్రం లో పోషించి, పెంచి... 
చక్కని రూపాన్నిచ్చి... తొమ్మిది నెలలు భరించి మనకీ ప్రపంచా న్ని బహుమతిగా అందిస్తుంది కదూ.... !
       తప్పటడుగుల తడబాట్లు సరిచేసి, సవ్యంగా నడవటం నేర్పి మసనల్ని గమ్యం చేరగలి గేసమర్థులుగాతీర్చిదిద్దేదిమనల గన్న తల్లిదండ్రులే కదూ... !
   మనం పుట్టిన రోజులే మన తల్లిదండ్రులకు ఉత్సవ దినాలు
   మనల్నికని...తల్లిదండ్రులమ య్యామని  ఎంత సంబర పడిపోతారో... ఎందరెందరికి మిఠాయిలు పంచుతారో... !
        మన ఆనందం కోసం వారి
సుఖాలనుత్యాగంచేసి...మనని కొండల్ని  చెయ్యటానికి వారికం డ లన్నీ కరిగిపోయి యముకల గూళ్ళుగా  మిగిలిపోతే....., 
     మనస్వేచ్ఛకు అడ్డవుతారని
ఆశ్రమాలలోవిదిలించేసి,వదిలించుకోవాలనుకునేముందు.... 
 ఒక్కసారివారేమనమైఆలోచిస్తే
అర్ధమౌతుంది !
   తద్దినాల లా దినోత్సవాలు చేసి,చేతులు దులిపేసు కోవ టం కాదు వారు....... మనం ప్రయో జకుల మయేవరకూ... ఎంత ప్రేమగా చూసుకున్నారో తలచుకుని... వారు కాటికి చేరుకునే వరకూ... మేము దిక్కులేని పక్షులమైపోయామే 
అనే భావన కలగకుండా చూసు కుంటేచాలు !ఈ మాతృదినోత్స
వ ఒకరోజు వేడుకలేవీ అవసరమే లేదు కదా..... !!
     ********
కామెంట్‌లు