సునంద భాషితం; -వురిమళ్ల సునంద, ఖమ్మం
 తల దించుకుని...తల ఎత్తుకుని...
******
 అనవసరపు భయాలు,మొహమాటాలు,  ఎవరో ఏదో అనుకుంటారేమోననే బిడియాలు కొందరిని తలదించుకుని వినయంగా నడుచుకునేలా చేస్తాయి.
వారిలో ఎంత సామర్థ్యం, ప్రతిభ, తెలివితేటలు ఉన్నా కానీ అలాంటి అతి మంచి తనం, ఎవ్వరినీ నొప్పించలేని తనమే, స్వార్థపూరిత  పెత్తనానికి అవసరాలకు బలయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే పిల్లల్లో గానీ స్నేహితుల్లో గానీ,అలాంటి మెతక లక్షణాలను గుర్తించిన వెంటనే, వాటన్నింటినీ పోగొట్టాలి. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని ముందుకు సాగిపోయేలా చేయాలి.
అలా ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో తలెత్తుకుని నిలబడిన వారికే ఈ సమాజం గౌరవాన్నిచ్చి నీరాజనాలు పలుకుతుంది.
 
ప్రభాత కిరణాల నమస్సులతో🙏కామెంట్‌లు