పి.ఎస్. చెట్టియార్....అని పిలువబడే పి.ఎస్. పక్కిరిసామి చెట్టియారుని తమిళ సినిమా పత్రికల పితామహుడని అంటుంటారు. ఆయన ప్రారంభించిన సినిమా ఉలగం ( సినీలోకం అని అర్థం) 1935 లో తమిళ సంవత్సరాదినాడు ప్రారంభమై 1947 వరకూ నడిచింది.
తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి వచ్చిన వారపత్రిక తమిళనాడు అంతటా పంపిణీ అయ్యేది. ప్రారంభంలో ఈ పత్రిక విడి ప్రతి ఖరీదు అర్ధణా. పేజీలు పదహారు. 1943లో దీని వెల రెండణాలైంది. ఈ పత్రిక సినీ రంగ పత్రికలకు మార్గదర్శిగా ఉండేది.
సినిమా ఉలగం పత్రికలో సినిమా, నాటకం, సంగీతం గురించి వార్తలు, విశేషాలు, సద్విమర్శలు ఉండేవి.
ఏ నటీనటులకో కళాకారుడికో కొమ్ముకాయక నిష్పాక్షింగా సమాచారాన్ని పాఠకులముందుంచేదీ పత్రిక. అట్లా ఈ పత్రిక మిగిలిన సినీ పత్రికలకు ఆదర్శప్రాయంగా ఉండేదని అప్పట్లో చెప్పుకునేవారు. పత్రికంటే ఇలా ఉండాలి అని సినిమా ఉలగం పత్రికకు ఓ ముద్ర వేశారు.
ఈ పత్రికలో విపులానంద అడిగళ్ తమిళ తెన్డ్రల్ తిరు.వి.క., పురట్చి కవి భారతిదాసన్, బాలభారతి, సు.దు. సుబ్రమణ్మ్య యోగిసామి, చిదంబరనార్, పి.ఆర్.ఎన్. మణి, తిరునావుక్కరసు మొదలియార్ వంటి అలనాటి ప్రముఖుల రచనలు తరచూ వెలువడుతుండేవి.
తమిళ కవిచక్రవర్తిగా వినుతికెక్కిన కణ్ణదాసన్ కవిత మొట్టమొదటగా ఈ పత్రికలోనే అచ్చయ్యింది.
అలాగే సుప్రసిద్ధ రచయిత వల్లికన్నన్ కొన్ని చిన్న కథలు ఇందులోనే వెలువడ్డాయి.
కాంగ్రెస్ నేత, ధీరర్ సత్యమూర్తి, ఓమారు ఈ పత్రిక గురించి ప్రస్తావిస్తూ సినిమా విద్యాలయాలలో ఈ పత్రికను ఓ పాఠ్యాంశంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు.
అంతటి పత్రిక వ్యవస్థాపకుడైన పి.ఎస్. చెట్టియార్ (1905 - 1967) బహుముఖప్రజ్ఞావంతులు. తమిళ మేధావి, పత్రికా రచయిత, సినీ కథ, మాటల రచయిత, దర్శకుడు, రాజకీయవాదిగా గుర్తింపుపొందారు.
తిరువారూర్ జిల్లాలోని నన్నిలం అనే గ్రామంలో పావాడైసామి చెట్టియార్, కమలత్తమ్మాళ్ దంపతులకు జన్మించిన పి.ఎస్. చెట్టియారుకి తమిళ సాహిత్యంపట్ల మక్కువెక్కువ. విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులైన ఈయన మద్రాసులోని ఓ ఉన్నత పాఠశాలలో తమిళ మాష్టారుగా పని చేశారు.
సిరువర్ విరుందు, సెందమిళ్ సెల్వి, బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవితచరిత్ర వంటి అనేక పుస్తకాలు రాసిన ఈయన అన్నై వాచకం స్కూళ్ళల్లో పాఠ్యపుస్తకంగా ఉండేది.
తమియరసు, తొయిలాలన్, అమృతగుణబోధిని పత్రికలకు సంపాదకుడిగా ఉండిన ఈయన స్వరాజ్య అనే తమిళ పత్రికలో ఉద్యమ వ్యాసాలెన్నింటినో రాశారు.
మొదట్లో మద్రాసు నుంచే వెలువడిన ఈ పత్రిక కొన్ని అనివార్య కారణాలతో కోయంబత్తూరు నుంచి ముద్రితమై పంపిణీ అయ్యేది.
కోయంబత్తూరులోని వెరైటీ హాల్ వీధిలో ఉన్న ఆయన ఇంట్లోని ఓ చిన్న గదిలో ఈ పత్రికపనులు జరిగేవి.
చాలాకాలం వరకు ఈ పత్రిక వెల అర్ధణాగానే ఉండేది. కవర్ పేజీ మాత్రం గులాబీ రంగులో వెలువడుతుండేది. ఈ పత్రిక ప్రతి ఒక్కటికూడా అందుబాటులో లేకపోవడం బాధాకరం. సినిమా ప్రపంచ విశేషాలు, తమిళం - ఇంగ్లీషు చిత్రాల సమాచారం, సమీక్షలు, ప్రశ్నలు - జవాబులు వంటివాటితో ఈ సినిమా ఉలగం పత్రిక వెలువడేది. ఈ పత్రికకు 1943లో ఓ తొమ్మిది నెలలు సహాయ సంపాదకుడిగా కొనసాగారు.
1936లో విడుదలైన రాజా దేసింగు అనే సినిమాకు పి.ఎస్. చెట్టియార్ కథ, మాటలు రాసారు.
సి. కణ్ణన్ పిళ్ళై సారథ్యంలో దండపాణి దేశికర్ మొట్టమొదటగా నటించిన తిరుమళిసై ఆళ్వార్ (1948) సినిమాకు కథ, మాటలు రాయడమేకాకుండా టి.ఎస్. కోట్నీతో కలిసి సహాయ దర్శక బాధ్యతలు చేపట్టారు.
కాలమేఘం అనే సినిమాకు కూడా ఈయన పని చేశారు.
భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈయన రెండుసార్లు చెన్నై కార్పొరేషన్ సభ్యుడిగా ఎంపికయ్యారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి