నిరీక్షణ - శ్రీమయి

 వేకువ ఝామున కిరణమై వేచి చూస్తున్న...
నీ కళ్ళల్లో వెలుగు నేనవ్వాలని...
ఆకలి పొద్దున ఆర్తిగా చూస్తున్న...
మొదటిముద్దై నీ కడుపు నింపాలని...
గోధూళి ఘడియల్లో గోముగా చూస్తున్న...
గంధమై నిన్నంటుకోవాలని...
సంధ్యా సమయంలో సన్నజాజినై పూస్తున్న...
నన్ను తాకిన గాలి నీకు పరిమళమద్దాలని...
రాత్రి వేళలో నిశినే అవుతున్న...
అలసిన నీ కంటికి కునుకు నేనవ్వాలని...
                                             
కామెంట్‌లు