నా హృదయంలో కొలువైన
ధైర్యం మా నాన్న
ద్వేషమైన,ప్రేమైన ఒకే రకంగా
స్వీకరించి ముందుకెళ్లాలి అంటూ
సమాజం పోకడ తెలిపిన నాన్న
నా కళ్ళలో కన్నీళ్లు తిరిగిన
ఓపలేని బాధ పంటిబిగువున పట్టి
నన్ను నవ్వించడం ప్రథమకర్తవ్యంగా
చలోక్తులు యుక్తిగా విసిరే స్నేహితుడు.
నాన్న రెండక్షరాల రక్షణ కోట
సమస్యలను నా ధరిచేరనివ్వక
పహారా కాసే... రక్షకభటుడు
కష్టాల హాలాహలాన్ని
గుండెన దాచిన దేవదేవుడు
కోరిన కోర్కెలు తీర్చు
భోళాశంకరుడు నాన్న
తన భార్య బిడ్డల కోసం
ఎంతైనా శ్రమిస్తాడు
మాట గంభీరంతో కంచులా మోగుతుంది
మనసు మంచులా కలుగుతుంది
నిస్వార్థ స్నేహితుడు నాన్న
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి