చుక్కలు (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్. జూన్ 06, 2022 • T. VEDANTA SURY చుక్కలండి చుక్కలు నింగిలోన చుక్కలు ఆకాశపు వలలోన చిక్కుకున్న చేపలు ముత్యాల ముగ్గులు లేత మల్లె మొగ్గలు నింగిలోన దేవతలుచల్లిరేమొ మల్లెలు నాకలోక వాసులువెలిగించిన దివ్వెలుఒకచోట గుంపుగా ఒక చోట ఒంటరిగాలెక్కబెట్టలేనన్ని అందాల చుక్కలు !! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి