వాక్కు;----సుమ.

 సృష్టిలో మానవులకు మాత్రమే 
కలిగిన వరం వాక్కు !
మాట్లాడే శక్తి ఉన్నా 
అవసరమైనపుడు నోరు తెరువకపోతే 
మనిషికి ఇతర ప్రాణులకు 
తేడా ఉండదు !
అందమైన భాషకు 
అలంకారాలు అద్దితే 
అభినందన అవుతుంది !
ఒక వ్యక్తి మంచితనాన్ని 
గొప్పతనాన్ని తెలిపే ప్రక్రియ !
ఇతరులను అభినందించటం 
మన వ్యక్తిత్వానికి తక్కువతనం కాదు 
పైగా హుందాతనం అవుతుంది !
--------------
కామెంట్‌లు