పర్యావరణ మిత్ర;-గుండాల నరేంద్రబాబు
తొక్కుదాం తొక్కుదాం
సైకిలే తొక్కుదాం
ఉందాం ఉందాం 
ఆరోగ్యంగా ఉందాం

తగ్గిద్దాం తగ్గిద్దాం 
కాలుష్యాన్ని తగ్గిద్దాం
వాడుదాం వాడుదాం
సైకిల్నే వాడుదాం

ఇంధన రహిత వాహనం
 వ్యాయామ సాధనం
ప్రశాంతమైన జీవనం
బ్రతుకెంతో పావనం

ప్రకృతి హితకారిణి
పర్యాటక వాహిని
ప్రగతి రథ సారధి
సర్వజన సన్నిధి

పర్యావరణ పెన్నిధి
విశ్వజన వారధి
సంతోషాల బలిమది
సామాన్యుని చెలిమిది

అందాల ప్రకృతి
ఆనందాల ఆకృతి
చేయ కోయి వికృతి
చేయి జన జాగృతి

ఇంధనాన్ని పొదుపుగా వాడుదాం
విలాసాలనే కాస్త వీడుదాం
సైకిల్నే ప్రధానంగా వాడుదాం
భావి తరాలకే స్ఫూర్తి నిద్దాం

( 03.06.2022 ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా)

గుండాల నరేంద్రబాబు  
అసోసియేట్ ఎన్.సి.సి.ఆఫీసర్
10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్.సి.సి నెల్లూరు
 తేది:03-06-2022
సెల్: 9493235992.


కామెంట్‌లు