పిట్టలు (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మా ఇంటి పెరటిలోన 
చింత చెట్టు ఒకటీ
చెట్టు కొమ్మల లోనా
చిట్టి గూడు ఒకటీ 
గూడులోనా రెండు
బుర్రు పిట్టాలు 
బుర్రు పిట్టల గూట్లో
చిన్ని గుడ్లూ రెండు 
గుడ్లపై పిట్టలూ 
కూరుచున్నాయీ
కొద్ది రోజులలోనే
ఆ గుడ్ల నుండీ 
రెండు చిన్ని పిల్లాలు
బయటకు వచ్చాయీ
వచ్చినా పిల్లలు 
కిచకిచ లాడాయీ 
పెద్ద పిట్టలు వెళ్ళీ
ఆహారమును తెచ్చీ 
పిల్లల నోటికీ అందించినాయీ
ప్రేమతో వాటినీ 
పెంచుకున్నాయీ
కొద్ది రోజులలోనే 
పిల్లలూ పెరిగినవీ 
పెద్ద పిట్టలూ రెండూ 
తమ పిట్టా పిల్లలకూ
ఎగరడం దూకడం 
నేర్పినాయీ చక్కా
ఎగరడం నేర్చినా 
ఆ పిల్లా పిట్టలూ 
ఎచటికో ఎగురుతూ
వెళ్ళీ పోయాయి చక్కా 
ఆ గూడు చూశాను నేనూ
బోసి పోయిందమ్మా నేడూ 
పెద్ద పిట్టాలె రెండూ 
మళ్ళీ కలిసి ఉన్నాయి చూడూ !!

కామెంట్‌లు