"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 78,వ,బాగం)-- "నాగమణి రావులపాటి "
 చెపుతాను విను అంటూ కవరు లోంచి రెండు పూలు దండలు తీసాడు. ఏమిటీ దర్శనం చేసుకున్నాముగా సరే గుడిలో ఇచ్చిరండి అని అన్నది కుసుమ......!!
ఇవి దేవునికోసం కాదు అని రాహుల్ అనగానే
ఓహో కారుకు వేస్తారా అని అమాయకంగా 
అడిగిన కుసుమ మాటలకు కారు కోసం కాదు
మనకోసమే అని అన్నాడు రాహుల్........!!
మనకోసమా ఏమిటీ మీరనేది కొంపదీసి నా మెడలో
వేస్తారా ఏమిటి అని విస్మయంగా కాస్త కంగారుగా
అడిగింది, కుసుమ...సందేహమా నీవు ఊహించింది
నిజమే కుసుమా, అని అన్నాడు, రాహుల్.......!!
అవును కుసుమా మన ఒప్పందంలో పూర్ణిమకు
వైభవ్ కు పెళ్ళిళ్ళు చేసేదాకా ఫ్రెండ్స్ లా కలిసి
వుందాం అనుకున్నాం కానీ పెద్ద దానివైపు నీ పెళ్ళి
కాకుండా చిన్నవాళ్ళ పెళ్ళి బాసికం చూడకూడదు
అని అంటారు కదా ...........!!
అందునా అన్నీ నీవై చూసుకోవాలి... ఆ దోషం
నీకు రాకూడదు మనిద్దరం హేపీగా వుండాలంటే 
మన వివాహం జరగాలి బాగా ఆలోచించే నేను
ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు రాహుల్.!!
నిజమే కానీ రాహుల్ అని, అనబోయీన కుసుమ మాటలకు అడ్డు వస్తూ,నాకు తెలుసు నీ మనసులోని భావం  నీకిచ్చిన మాట ప్రకారం మనకు పెద్దలు సమక్షంలో వివాహం జరిగే దాకా మనం స్నేహితులు
గానే వుందాం ఈ  విషయం మనిద్దరిలోనే దాచుకుందాం. ఈ నా చిన్న కోరిక తీర్చు కసుమా
అని బతిమాలితే రీతిలో అన్నాడు రాహుల్.........!!
ఇంకా నాపై అనుమానమా కుసుమా అని రాహుల్
అనగానే సరే అని అనక తప్పలేదు కుసుమకు.....
పురోహితుడు తో మాట్లాడి వేదమంత్రాలు నడుము
కుసుమ రాహుల్ దండలు మార్చుకుని ఆయన
దగ్గర ఆశీర్వచన ఆశిస్సులు  తీసుకుని కారులో
కూర్చున్నారు రాహుల్ కుసుమాలు........!!
ఆనందం బాష్పాలు కనులను పలకరించగా
ప్రేమ నిండిన హృదయాలు మనసును మురిపించి గా
ఒకరికి ఒకరు సొంతమైన భావనతో ఊహల
పొదరిల్లు తలుపుల తలుపులు తెరవగా కలలన్నీ మంగశ తోరణాలై సరాగాలు సన్నాయి పాడగా
మేఘాలు పల్లకీలో ఊరేగారిద్దరూ..‌‌........!!
ముందుగా తేరుకున్న కుసుమకు ఎక్కడలేని సిగ్గు
ముంచుకొచ్చింది.నేను వెనుక సీటులో కూర్చుంటాను
అని మారాం చేసింది, కుసుమ...ఇక్కడ కూర్చుంటే
ఏమవుతుంది అని అన్నాడు రాహుల్,చిలిపిగా...
ఇంతలో (సశేషం)...................!!

కామెంట్‌లు