పరిమళించు బాలలు ;-పి.చైతన్య భారతి 7013264464
అంశం:-'ల్ల'ఒత్తు గుణింత బాలగేయం 
======================
అల్లరి చేసే బాలలు అందం 
ఇల్లంతా సందడితో ఆనందం 
ఉల్లమందునిర్మలమైఉంటారు 
కల్లాకపటం తెలియనివారు 

తల్లిదండ్రులబాటనడుస్తారు 
ఎల్లరకు నచ్చినట్లు చేస్తారు 
పిల్లలే భావిభారత దీపాలు 
మల్లెలై పరిమళించుపాపలు  

లిల్లి పూల నేరుకొచ్చి వారు
లొల్లి లేక మాలకూర్చినారు 
వల్లితో కలిసిగుడికెళ్ళినారు 
చల్లని దీవెనలే  కోరినారు 

పల్లవించె ప్రియగానములు 
వెల్లువలా ఆలపించి పాటలు 
మొల్లవలె మనసు దోచారు 
గల్లియంతమారుమ్రోగించారు 


కామెంట్‌లు