బాల పంచపదులు;-:విలువలతోనే విలువ;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
1.చేతికి నిత్యం దానం!
   నోటికి సత్యభాషణం!
   నోటుకు చేసే సంతకం!
   మనిషికి చెడని శీలం!
 బతుకు విలువ,
                 విలువలే,రామా!

2.అమ్మ విలువ అనంతం!
    నాన్న విలువ గౌరవం!
    గురువు విలువ విజ్ఞానం!
    దైవం విలువ జీవితం!
     బతుకు విలువ ,
                విలువలే, రామా!

3. శ్రమ విలువ తెలియాలి!
     కాలం విలువ తెలియాలి!
     ధనం విలువ తెలియాలి!
    చదువు విలువ తెలియాలి!
       బతుకు విలువ,
                     విలువలే,రామా!
_________


కామెంట్‌లు