తీర్పరి కానివాడు;ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.

 ఇంటిలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ తీర్పు చెప్పే వాడు లేకపోతే  ఏ మంచీ జరగదు. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్ద కలగజేసుకుని  తప్పొప్పులను నిర్ణయించి చేయవలసిన పని చేస్తాడు. అంతటితో ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఏ గ్రామంలోనైనా ఒక జరగరాని పని ఏదైనా ఒకటి జరిగినప్పుడు గ్రామ పెద్ద  గ్రామస్తులతో పాటు తప్పు చేసిన వారిని కూడా పిలిచి ఆ తప్పు ఎందుకు చేయవలసి వచ్చింది దాని వెనుక కారణాలు ఏమిటి అనితెలుసుకున్న తర్వాత  తాను తీర్పును ఇస్తాడు  అలా నిర్ణయించ గలిగిన జ్ఞానం ఉన్నవారిని ఆ గ్రామ ప్రజలు పెద్దగా ఎన్నుకుంటారు. ఎన్నుకునే ముందే ఆయన అర్హతలు కూడా పరిశీలించి  నిర్ణయిస్తారు. ఆయన తీర్పు చెప్పిన తరువాత రెండవ ఆలోచన రావడానికి అవకాశం లేదు. గ్రామంలో జరిగినట్లే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దేశంలో ప్రధాన మంత్రి నిర్ణయాలు తీసుకుంటారు.  నిర్ణయాలు తీసుకునే ముందు తప్పుఒప్పులను తెలుసుకొని  పరిశీలకుల అభిప్రాయాలను కూడా మన్నించి చేయవలసిన మంచి పని చేస్తారు. అలా నిర్ణయం చేయలేని వ్యక్తి ఆ స్థానానికి పనికి రాడు. తెలివిగల నాయకుడు అయితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది లేకుంటే పతనమై పోతుంది. బీరాలు పలికే వాడు కాదు మనకు కావలసింది సరియైన పని చేసే వ్యక్తి అవసరం. 

కామెంట్‌లు