ధన్య చరితలు;-గుండాల నరేంద్రబాబు సెల్: 9493235992
 పల్లవి:
కొమ్మల్లో కువకువలాడే కోయిలమ్మలు
గుమ్మంలో కళ కళ లాడే ఆడపిల్లలు
 కొలనులో కిలకిల నవ్వులు రువ్వే కలువలు
ఇలలో తళతళ  కాంతులు పంచేటి   దివ్వెలు
చరణం:1
ప్రగతికే బాటలు పరచేటి శ్రమజీవులు
జగతినే జాగృతి చేసేటి క్రాంతదర్శులు
ముంగిలిలో మెరిసేటి ముత్యాల   ముగ్గులు
లోగిలిలో మురిసేటి  సిగ్గు పూబంతులు   
చరణం:2  
నింగి నుంచి నేలకు జారిన హరివిల్లులు
పొంగిపొర్లే వెన్నెల వన్నెల జలతారులు 
దివిని వీడి భువినే చేరే  ధన్య చరితలు
కవిని చేరి కవితలా మారే భాగ్యలతలు 


కామెంట్‌లు