బాలగేయం;-జి.లింగేశ్వర శర్మ-9603389441
 దర్శనమవ్వక సూరీడు
వర్షలెన్నో కురిశాయి
వారంరోజులు సాగాయి
చెరువులు కుంటలు నింపాయి
ఇబ్బందులనే.తెచ్చాయి
ఇంటిపట్టునే నుంచాయి
బడులకు సెలవులు వచ్చాయి
చదువులన్నీఆగాయి
ఆటపాటలలోముంచాయి
వర్షాలింకనుతగ్గాయి
బడితలుపులు తెరిచాయి
సంతోషాన్నీ నింపాయి
పదపదమంటూ సాగుదాం
పాఠశాలలకు చేరుదాం
పాఠలెన్నో విందాం 
విద్యాబుద్ధులు పొందుదాం

కామెంట్‌లు