మాట పాట ఆట;- పెందోట వెంకటేశ్వర్లు--సిద్దిపేట
ముద్దు ముద్దు పలుకులు
 రామచిలక కులుకులు
 కమ్మనైనా పాటలు
 కోకిలమ్మ గానాలు

 తీరేనా నాట్యాలు
 నెమలమ్మ సొంతాలు
 మాట పాట నాట్యాలు
 నేర్వాలి పిల్లలు

 అలరించి మెప్పించిన
 భవితలోన నేర్పరులు
 అభ్యాసము కూసువిద్య
 మనసు నిల్పి నేర్వండి
 


కామెంట్‌లు