హరితహారం ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఇంటి ముందు చెట్లు
ఇంటి వెనుక చెట్లు
బాట పక్కన చెట్లు
కోట పక్కన చెట్లు
గుడి లోన చెట్లు
బడి లోన చెట్లు
పూలనిచ్చే చెట్లు
కాయలనిచ్చే చెట్లు
పండ్లనిచ్చే చెట్లు
కూరలిచ్చే చెట్లు
మందు నిచ్చే చెట్లు
మోకులనిచ్చే చెట్లు 
కూడునిచ్చే చెట్లు
గూడునిచ్చే చెట్లు
గుడ్డనిచ్చే చెట్లు
కలపనిచ్చే చెట్లు
గాలినిచ్చే చెట్ల
వాన లిచ్చే చెట్లు
భూమిని కాపాడే చెట్లు
జీవులను కాపాడే చెట్లు
అందుకే మనమంతా
పచ్చని చెట్లను అవనికి
పచ్చల పతకపు హరితహారాన్ని
నజరానాగా ఇద్దాం !!

కామెంట్‌లు