సునంద భాషితం ;--వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఓర్పు... నేర్పు... 
*****
మనిషికి కావలసింది కొండంత ఓర్పు.కొంతైనా నేర్పు. ఇవి రెండూ ఉంటే అనుకున్నవి సాధించగలడు. తన నేర్పుతో సమాజంలో గుర్తింపు పొందగలడు.
సాధన చేసే సమయంలో అనేక రకాల సమస్యలు, కష్టాలు, ఆటంకాలు ఎదురవ్వడం సహజం. వాటిని ఓర్పుగా భరించాలి. వాటికి బేంబేలెత్తి ఓర్పు కోల్పోతే తీరని నష్టం జరుగుతుంది.
గొంగళి పురుగు దశలో  ఎందరివో అవమానాలు ఛీత్కారాలను ఎదుర్కొంటుంది.అయినా సహనంతో తాను కలగన్న సీతాకోక చిలుక రూపాన్ని పొందుతుంది.
కోడిగుడ్డు లోంచి పిల్ల బయటికి రావాలంటే  ఓపిగ్గా ఎదురు చూడాల్సిందే. అలా పొదిగేసి ఇలా రమ్మంటే రాదు కదా...!
దేనికైనా సమయం పడుతుందనేది గమనంలో  పెట్టుకుని భవిష్యత్తుపై నమ్మకం పెట్టుకుని, ఓర్పుతో సాగిపోతూ, నేర్పుగా జీవితాన్ని మలుచుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు