సుప్రభాత కవిత ; -బృంద
మంచీ చెడులు
మనసు చెబుతూనే వుంటుంది .
మనం చేసిందే 
సరైనదనుకుంటాము.

తప్పు ఒప్పులూ విప్పి చెప్పి
నిర్ణయం నీదేనంటుంది.
తప్పు చేస్తూ ఒప్పే 
అనుకుంటాము.

ఆలోచనలు సాగదీయొద్దని
చెబుతుంది.
మనం వినం

అనవసర విషయానికి
ప్రాముఖ్యత  వద్దు అంటుంది.
మనం వినం.

అతిగా భయపడవద్దు
అయ్యేదవతుంది అంటుంది
మనం వినం.

గడచినవి తవ్వుకోడం
దేనికీ....వర్తమానంలో  ఉండమంటుంది.
మనం వినం.

అతిగా ఆశించకు.
ఆశాభంగమవుతుంది అంటుంది.
మనం వినం.

మనసు చెప్పినట్టు వినకుండా
మనసే బాలేదంటాం!

బాధ......కోరిక.....ద్వేషం...ప్రేమ
పెంచుకుంటే పెరుగుతుంది.
తుంచుకుంటే  విరుగుతుంది.

విచక్షణ తో  ఆలోచించే
విజ్ఞానం పెంచుకుంటే మనశ్శాంతి.

వెలుగు వేపు అడుగు 
వేయించమని
జ్యోతి రూపమైన దైవానికి
వందనాలు అర్పిస్తూ

🌸🌸 శుభోదయం🌸🌸


కామెంట్‌లు