మన భాష తెలుగు--తెలుసుకుంటే వెలుగు;--రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
 పిల్లల కోసం సరికొత్త భాషా సాహిత్య పరిచయ  వ్యాసాలు
తెలుగు ఒడిలో....
చింత చెట్టు. 20
చింత చిక్కిన మనసు
అగ్గి పొంతన వెళ్ళి..
అన్నదొక సామెత.
చింత అంటే ఆలోచన , దిగులు మొదలైన అర్థా లున్నాయి. 
 ఐతే..మనకు ఉపయోగపడే చెట్లలో "చింత " అనే పేరున్న చెట్టు ఒకటి. 

చింతూరు పూస్తే సిరులు ...అంటారు
చింతలు అంటే చింత చెట్లు . చింతచెట్టు కాండం మొదలు చిగురు, కాయలు అన్నీ
మనిషికి డబ్బును సంపాదించి పెడుతుంది.డబ్బు, సంపద, బలం, బలగం మొదలైనవన్నీ ఉన్నాయని విర్రవీగే వాడు అవి పోయినా
అలాగే విర్రవీగుతాడు.
ఈ చెట్టును వంక పెట్టుకుని అలాంటి మనుషుల మనస్తత్వాల గురించి
.‌‌చింత చచ్చినా పులుపు చావదు...అని చెప్పబడింది .ఈ మాటలను బట్టి 
చింతలు అనేవి పుల్లగా
ఉంటాయనే విషయం అర్థమైంది కదా. ఈ పులుపు అనేది షడ్రుచులలో ఒకటి.
మన దేశమంతా పెరుగుతూ పెంచబడుతూన్న ఈ చింత చెట్టును ఆమ్లిక,
చింత, చుండుకము, చుక్ర చుక్రిక,తింత్రిణి యమదూతిక మొదలైన పేర్లతో పిలుస్తారు.
చింతాకంత బంగారమున్నా చాలనుకునే  వారు కొందరుంటారు. చింతాకు చిన్నదిగా ఉంటుంది.చిన్నగా ఉండే కళ్ళనుచింతాకులతో  పోలుస్తారు.
 చింతకాయలను
ఎరుగని చిలుక చింతకాయల్ని చూచి 
కొడవళ్ళు అన్నదట...
అని 
చింతకాయలు తిన్న నోరు  కొఱ్ఱలు తినగలదా ....అని చింతకాయల గురించి సామెతలు చెప్పబడ్డాయి.

ఇంకా ...పుట్ట తో చీరకట్టు పెద్దదై చీర విడుచు..అని, 
చింతపవ్వు పుల్లగుండు
గుండు నల్లగుండు..అని, 
చిటారు కొమ్మన అరవై కొడవళ్ళు...అని చింత కాయల గురించి, 
పండు కాని పండు
తీపి లేని పండు
ఉట్టి లో ఉంటుంది...
అని చింతపండు గురించి ఎంతో చెప్పబడింది.
కామెంట్‌లు