వంతు ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అల్లరి చేయడం పిల్లలవంతు 
ఆనందించడం పెద్దలవంతు
మారాం చేయడం పిల్లలవంతు
మార్పులు చేయడం పెద్దలవంతు 
అలకలు అలగడం పిల్లలవంతు 
అలకలు తీర్చడం పెద్దలవంతు
మాటలాడడం పిల్లలవంతు
బాటలు వేయడం పెద్దలవంతు 
కోతలు కోయడం పిల్లలవంతు 
చేతలు మార్చడం పెద్దలవంతు 
తప్పులు చేయడం పిల్లలవంతు
ఒప్పులు చెప్పడం పెద్దలవంతు
కోరికలు కోరడం పిల్లలవంతు
కోరికలు తీర్చడం పెద్దలవంతు
ఆనందించడం అందరివంతు !!

కామెంట్‌లు