సుప్రభాత కవిత ; -బృంద
వేకువ ఝామున
తూరుపు  వీణ
వెలుగు తీగల మీటుతూ
పాడే  మేలుకొలుపు

గాలి  మోసుకొచ్చే
ఉదయరాగం.

నెమ్మదిగా కదిలే ఆకుల
 తాళం.

జల జల జారే జలపాతాల
సరిగమలు

కలకల సాగే నదుల నీటి
గలగలలు

పధ్ధతిగా కదులుతూ
కడలి అలల
వేద పఠనం.

ముసి ముసి నవ్వుల
విరిసే పువ్వుల  గుసగుసలు

జగతికి చైతన్యం నింపే
భానుడి రాక  

పుడమి ముంగిట
అనుదినం
వెలుగులు చిమ్మే
ఉదయపు వేడుక

ఆదిత్యునికి అంజలి ఘటిస్తూ

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు