బెంగాలీకవి నాటకకర్త గిరీష్ చంద్రఘోష్ కి బాగా డబ్బున్న గర్విష్టి ఫ్రెండ్ ఉన్నాడు.అతనికి ఎలాబుద్ధి చెప్పాలా అని గిరీష్ సమయం కోసం వేచిచూస్తున్నారు.ఫ్రెండ్ ఎక్కడకి వెళ్లినా అతని నౌకరు వెంట వెండి పాత్రలు మోసుకుంటూ వెళ్లేవాడు.ఒకసారి గిరీష్ ఇంటికి విందుకై తన సామాన్లతో హాజరైనాడు.అందరితో కలిపి అతనికి భోజనం పెట్టకుండా వేరే గదిలో విస్తరాకులో వడ్డించాడు.అది అవమానం గా భావించాడు. అతను వెళ్లబోయేముందు గిరీష్ వంటతను అన్ని వెండి పాత్రల్లో వంటకాలు నింపి ఆధనికుని నౌకరుకి ఇచ్చాడు.గిరీష్ ఎంతో తెలివిగా మిత్రునితో అన్నాడు "సారీ భయ్యా! మీఇంట్లో వారి కి తీసుకుని వెళ్లాలని తెచ్చావు అని మావంటతను భావించాడు. నీకు వాటిలో వడ్డించాలని అతనికి తెలీదు."
పాపం ఆమిత్రుని తల సిగ్గుతో వాలిపోయింది అని వేరే చెప్పాలా?
ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది కాశీహిందూ విశ్వవిద్యాలయంలో రెక్టర్ గా ఉన్నారు. ఏదోవిషయంపై పిల్లలు గొడవపడి ఆయన్ని ఘెరావ్ చేశారు. ఆయన అందరిని శాంతపరుస్తూ"మీరు అనవసరంగా నన్ను అవమానిస్తున్నారు.ఈజన్మలోనైనా లేక వచ్చే జన్మలో నైనా యూనివర్సిటీ ఉద్యోగి వైస్ ఛాన్సలర్ కావాలని శపిస్తున్నాను."అంతే పిల్లలు అంతా ఘొల్లుమని నవ్వేసి ఆయన్ని క్షమాపణలు వేడి తరగతులకు హాజరయ్యారు.
ఇక ద్వివేదీ ఉపన్యాసం చాటభారతం!అందుకే సభలో ప్రసంగించేముందు చిన్న పిల్లాడిలా నవ్వుతూ ఇలా అనేవారు "నా40పేజీల ఉపన్యాసం మిమ్మల్ని ఖంగారు పెడుతుంది అని నాకు తెలుసు. అందుకే సౌకర్యం కోసం 3భాగాలుగా విభజించాను.ఆరంభం-గప్పాలు-ఉపసంహారం."అంతే అంతా పకపకానవ్వారు.ఆయన ఉపన్యాసం లో కొన్ని మచ్చుతునకలు"చెమట అందంగా రాయటాన్ని నేర్పుతుంది. చెమట పవిత్రం పావనం! బైటకి రావటం వ్యర్థం కాదు. చల్లగాలితగిలితే సేదతీరుస్తుంది." ఆరోజుల్లో చర్చలు ఉపన్యాసాలు బాగా నడిచాయి.కానీ నేడు మైకాసురులు ఉంటే మిగతావారికి ఛాన్స్ బహుదూరం!క్లుప్తంగా 10నిముషాల్లో ముగిస్తే టాపిక్ జోష్ గా ఉంటే చప్పట్లు!లేకుంటే సభమధ్యలోనే చల్లగా జారుడు! క్లాసులో టీచర్ సుత్తి కొడితే బైట కామెంట్స్ చేసే పిల్లల కాలం!సూక్ష్మంలో మోక్షం లా ఇంకా వినాలి అనిపించాలి.🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి