చతురత! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహారాజు తనకొడుకు వర్మ తో అన్నాడు "నాయనా! ఒక నెలరోజుల పాటు దేశాటనం చేసి నీకు నచ్చిన రాకుమారిని స్వయంగా ఎన్నుకో!లోకజ్ఞానం వింతలు విశేషాలు తెలుసు కో"
అలాగే అని వర్మ తన బాల్యమిత్రుడైన సుశేనునితో బైలుదేరాడు అతి సామాన్యవేషంలో! ఓరోజు ప్రయాణం తర్వాత చంపానగరం చేరారు ఇద్దరు. ఆదేశ రాకుమార్తె  గుణశీల మహా అందగత్తె సుగుణాల రాశి! కానీ ఆమె షరతులకు భయపడి  వరులు రావటంమానేశారు.ఓపూటకూళ్ల అవ్వ ఇంట్లో బసచేశారు మిత్రులు ఇద్దరు. ఆమె వారికి గరిక పచ్చడి చారు అన్నం పెట్టినా  ఆకలితో గబగబా తిని తృప్తి గా లేచారు."అవ్వా!ఈఊరి విశేషాలు ఏంటి?" "ఏముంది? మారాకుమార్తెకు పెళ్లి కావటం కష్టం గా ఉంది. తనతోపాటు తన చెలి మిత్రవింద పెళ్లి ఒకేదేశానికి చెందిన రాకుమారుడు అతని ప్రియమిత్రునితో జరగాలని పట్టుపట్టింది. మీరు మంచి మిత్రులు గా కన్పడుతున్నారు.కానీ చాలా బీదవారుకదా? వియ్యానికైనా కయ్యానికి కైనా సమ ఉజ్జీలుకావాలి.పైగా ఆమె మూడుషరతులు పెట్టింది. ఒకపాత్రనిండా ముత్యాలని అడవిలో ఏరితేవాలి.రాకుమారి ఉంగరాన్ని సరస్సులోంచి బైటకి తీసి ఇవ్వాలి. వేదిక పై పదిమంది కన్యలు ఒకేరకం దుస్తులు అలంకరణ లోఉంటే  గుణశీల ను గుర్తించాలి. ఆమె కి తేనె అంటే మహాఇష్టం!" అని  సూచించింది. ఆమె దగ్గర సెలవుతీసుకుని అడవిలో ముత్యాలు ఏరటానికి బైలుదేరారు.వీరిద్దరికీ ప్రతి ప్రాణి జీవికి సాయం చేసే దొడ్డ బుద్ధి ఉంది. చీమల బారు కనపడితే"చిట్టి చీమల్లారా!మారాజ్యంలో మీపుట్టలకి ఎవరూ అపాయం కలిగించకుండా మేము కాపాడుతున్నాము.మాకు ముత్యాలు ఏరి ఈగిన్నెలో వేయండి "అన్నాడు వర్మ."మాకు తెలుసు బాబు మీదయాగుణం!మాఇరుగుపొరుగు ప్రాంతాల్లో ని బంధువులు చెప్పాయి"అని  చీమల దండు రెండు గంటల్లో ముత్యాలు ఏరి ఓగిన్నెను నింపాయి.సరసు దగ్గరకు వెళ్లి  తమ గురించి చెప్పారు వాళ్ళు. "మీరు జలచరాలను పక్షులను కాపాడుతారని విన్నాం. "అని బాతులు కొంగలు చేపలు సరసంతా గాలించాయి.ఓచేప రాకుమారి ఉంగరాన్ని తెచ్చి ఇచ్చింది.  రాకుమారి కి తేనె చాలా ఇష్టం అని అవ్వ చెప్పింది.అందుకే తేనెటీగల సాయంకోరాడు వర్మ.రాణీ ఈగ అంది"గుణశీల కి తేనె అంటే చాలా ఇష్టం!నేను ఆపదిమంది కన్యల చుట్టూ తిరిగి  ఎవరినోట్లోంచి తేనె వాసన కొడుతుందో ఆమె తలపైన చుట్టూ తిరుగుతూ ఉంటాను.నీవు ఆమెని తేలిగ్గా గుర్తు పట్టగలవు." గిన్నెలో ముత్యాలు  ఉంగరంతో  రాజసభకి వెళ్లారు.అక్కడ పదిమంది అమ్మాయిలు ఒకేరకం అలంకరణ దుస్తులలో ఉన్నారు. తేనె టీగ అందరిచుట్టూ తిరుగుతూ గుణశీల దగ్గరగా తిరుగుతుంటే వర్మ "ఆమెయే రాకుమారి!" అని గట్టిగా అరిచాడు. ఆమూడు పరీక్షల్లో నెగ్గిన వర్మ తన మిత్రుడు  మంత్రి కొడుకు తన బాల్యస్నేహితుడని చెప్పటంతో  గుణశీల అతని మెళ్ళో వరమాలవేసింది.సుసేనుడిని మిత్రవింద  వరించింది. ఇలా పూర్వం శక్తి యుక్తి చాతుర్యం పై ఆధారపడి రాకుమారి స్వయంవరాలు జరిగేవి.ఒరియా జానపద కథలు కొన్ని ఇలాంటివే ఉంటాయి 🌹
కామెంట్‌లు