చెప్పుడు, తప్పుడు (మాటలు)
******
కొందరు చెప్పుడు మాటలు తేనె కన్న తీయగా,ఇంకా ఇంకా వినాలన్న ఆసక్తికరంగా ఉంటాయి.
అవి తడక పెట్టినట్లు కాకుండా గోడ కట్టినట్లుగా పటిష్టంగా మనసుకు మాయా పొరలు కమ్మిస్తాయి.
ఆ దేవుడొచ్చి చెప్పినా నమ్మనంత బలంగా ఉంటాయి.
పచ్చని కాపురమా, స్నేహమా, మరేదైనా కావచ్చు. ఈ మాటలు మధ్యలో అగ్ని పర్వతాలై పేలి బతుకంతా ద్వేషాగ్ని రగిలిస్తాయి.
చెప్పుడు మాటలు చెప్పే వారిని గమనించి మొగ్గలోనే తుంచి వారి స్నేహానికి దూరంగా ఉండాలి.
అలాగే కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి వారిని గురించి చెడుగా ఆలోచిస్తూ నోటికొచ్చినట్టు మాటలు తూలుతుంటారు. ఇతరుల అభివృద్ధిని, మంచిని సహించలేని మనస్తత్వం వారిది.
అలాంటి తప్పుడు మాటలు మాట్లాడేవారికి, చెప్పుడు మాటలు చెప్పే వారిని దూరంగా ఉంటేనే మంచిది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి