అహ్మద్ నగర్ కోట ..; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై ,
 అహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లోని కోట. ఇది అహ్మద్ నగర్ సుల్తానేట్‌కు చెందినది. ఈ కోటను అహ్మద్ నిజాం షా, సుమారుగా 15, 16వ శతాబ్దాలలో నిర్మించాడు. యుద్ధాలలో పట్టుబడ్డ సైనికులను ఈ కోటలో ఖైదీలుగా వుంచేవారు. 1803 లో జరిగిన రెండవ మరాఠా యుద్ధంలో బ్రిటిషు వారు దీన్ని పట్టుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో స్వాతంత్ర్య యోధులను కూడా ఇక్కడ బందీలుగా వుంచేవారు. ఈ విషయాన్ని ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తాను రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథంలో పేర్కొన్నాడు. అహ్మద్ నగర్ కోటకు మార్లు నిజామి రాజులు పలు మరమ్మతులు చేయించారు. ప్రస్తుతం ఇది భారతదేశ మిలిటరీ ఆధీనంలో ఉంది.
కోటకు సుమారుగా 18 మీటర్ల ఎత్తుకల గోడలు, 22 బురుజులు, 24 దుర్గాలు, 30 మీటర్ల వెడల్పుతో ఉంటుంది కోట గోడ చుట్టూ బయటి వైపున కందకం ఉంది. ఈ కంద్కం 5.5 మీటర్ల వెడల్పుతో, 2.7 మీటర్ల లోతున నీటితో నుండి ఉంటుంది.
ఈ కోటను మాలిక్ అహ్మద్ నిజాం షా, సుమారుగా 15, 16 శతాబ్దాలలో నిర్మించాడు. అహ్మద్ నగర్ పట్టణానికి ఆ పేరు అతడి పేరిటే వచ్చింది. అతడు నిజాం షాహి వంశంలో తొలి సుల్తాను. తొలుత దీన్ని మట్టితో నిర్మించారు. తరువాత హుస్సేన్ నిజాం షా 1559 లో దీన్ని బలోపేతం చెయ్యడం మొదలుపెట్టి 1562 లో పూర్తి చేసాడు. 1596 ఫిబ్రవరిలో చాంద్ బీబీ మొగలుల దండయాత్రను తిప్పి కొట్టింది. కానీ 1600 లో అక్బరు మళ్ళీ దండెత్తినపుడు ఈ కోటా మొగలుల వశమై పోయింది. 
ఔరంగజేబు తన 88 వ ఏట 1707 ఫిబ్రవరి 20 న ఈ కోట లోనే మరణించాడు. 1724 లో ఈ కోట నిజాముల వశమైంది. 1759 లో మరాఠాలకు ఆ తరువాత 1790 లో సిందియాలకూ చేజిక్కింది. రెండవ మాధవరావు మరణం తరువాత ఏర్పడిన అస్థిర పరిస్థితుల్లో దౌలత్ సిందియా ఈ కోటను, దాని చుట్టుపట్ల ఉన్న ప్రాంతాన్నీ వశపరచుకున్నాడు. 1797 లో అతడు నానా ఫడ్నవీసును ఈ కోటలోనే బంధించాడు.
1803 లో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో వెల్లస్లీ మరాఠాలను ఓడించడంతో ఈ కోట ఈస్టిండియా కంపెనీ పరమైంది..


కామెంట్‌లు