చరాస్తులు.. స్థిరాస్తులు
*****
జీవితంలో చరాస్తులు స్థిరాస్తులు ఉండటం అనేది సహజం. వాటి కోసం తాపత్రయ పడుతూ పరుగులు తీయడం సహజాతి సహజంగా జరుగుతూనే ఉంటుంది.
చరాస్తులు తరిగిపోతున్నా స్థిరంగా నిలుపుకునే ఆస్తులు కూడా కొన్ని ఉంటాయి.
ఎంత నిలువ చేసుకోవాలనుకున్నా ఆగకుండా చరిస్తూ తరిగిపోయే ఆస్తులు...బాల్యం, యవ్వనం మధ్య వయసు...
కాలచక్రంలో దశలు దశలుగా మారుతూ,కరుగుతూ తరిగిపోయే ఆస్తులవి. వాటిని స్థిరంగా ఉంచుకోవడం ఎవరి తరమూ కాదు.
కానీ ఎన్ని మార్పులు వచ్చినా, కాలంతో పాటు మన ఆస్తులు కనుమరుగైనా, స్థిరంగా దాచుకునేవి రెండు ఉన్నాయి.
అవే మనం చేసే మంచి, పొందే కీర్తి.
ఇవి రెండూ ఎవరూ దోచుకోలేని స్థిర ఆస్తులు.
ఈ లోకంలో మనకంటూ మిగిలేవి నిలిచేవి పరోపకారం, ప్రతిష్టాత్మకమైన కీర్తి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి