సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  శ్వాస...ఆశ... 
   ******
 శ్వాసించే ప్రతి జీవికి బతకాలనే ఆశ ఉంటుంది.
 ఆశే శ్వాసను బతికిస్తుంది. బతకడంతోనే ఆగిపోదు ఆశ. అనేకానేక సాధనలు, కోరికలు, వాటి వెంట పరుగులు నిరంత వీటి గురించి ఎడతెరిపి లేని ఆలోచనలు.
ఆ ఆలోచనలతో  అనుకున్నది సాధించేందుకు వేసుకునే సోపానాలు.
ఇలా జీవన చక్రం గిరగిరా తిరుగుతూ ఉంటుంది.ఆశల్లో ఎన్నో రకాలు ఉంటాయి.
కానీ పరోపకారం,సమాజ శ్రేయస్సుకు పరితపించే ఆశలో గొప్ప మహదాశయం దాగుంటుంది.
ఆ ఆశయం ఆచరణ రూపంలోకి రావడానికి  వారి శారీరక మానసిక శ్రమ ఉంటుంది.
అలాంటి ఆశయాలతో బ్రతికే వారి శ్వాస ఎప్పుడూ  అత్యున్నతమైన ఆశయంతో పరిమళిస్తుంది. తరువులా పరోపకారార్ధమై ఎన్నో త్యాగాలు చేస్తుంది.
 కాబట్టి  మన శ్వాసను ఆశను చేద్దాం.ఆశను ఆశయంగా మార్చుకుని సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తూ నేను సైతం అంటూ ఆశయ సాధకుల అడుగు జాడల్లో నడుద్దాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు