గోదావరి ప్రభ;-కిలపర్తి దాలినాయుడు

వానపడితె గోదావరి
ఈదినట్టు ఉంటుంది
వానలేనిగోదావరి
చేదినట్టు ఉంటుంది
గోదావరి పాట వీణ
మీటినట్టు ఉంటుంది
గోదావరి తెలుగు ప్రభను
చాటినట్టు ఉంటుంది!
గోదావరి సంస్కృతిని
నేర్పినట్టు ఉంటుంది
గోదావరి వరి కుప్పలు
కూర్చినట్టు ఉంటుంది!
కెరటాలే కేరింతల 
బాల్య మట్టులుంటుంది!
విరితావులె తీరాలను
నాటినట్టులుంటుంది!
దేవాలయ ప్రాంగణాలు
తాకినట్టులుంటుంది!
తల్లీ గోదారి నీకు వేనవేల
వందనాలు!
క్ష్బుద్భాను తీర్చు తల్లి
అభినందన చందనాలు!
---------------------------------

కామెంట్‌లు