నవజీవన గీతం. ;-: సి. శేఖర్(సియస్సార్)

 ఎదమాటున దాగివున్న
జ్ఞాపకాలన్నొక్కక్కసారి
మనసు తెరమీద దర్శనమిస్తూ 
జరిగిపోయిన సంగతులనన్ని
ముందుపరుస్తాయి
మరుపురాని అనుభూతులన్నీ
మస్థాష్కంలో భద్రంగా సేదదీరుతుంటయ్
తప్పని తెలిసినవేళ తలదించుకునేలా
తత్ క్షణానికుపయోగపడ్డప్పుడు
అనుభవంలా 
భవిష్యత్తు దిద్దుకునేందుకు గురువులా
నడిపిస్తుంటాయ్
తడబడకుండ తోడునిలిచేవి
గడిచిన ప్రతిక్షణం గతమైపోయినట్లు
గతమంతా జ్ఞానమై నిలిచినట్లు
జ్ఞానం అజ్ఞానాన్ని తరిమి 
నడకను నడతను నేర్పిస్తుంది
కాలంతోపాటు పోటిపడుతూ
ప్రశాంతతీరానికి పయనింపజేస్తుంటాయ్
శరీరంలో మార్పులెన్నొచ్చినా
మనసుమాత్రం ప్రేరణగీతం ఆలపిస్తుంటది
నవజీవనానికి నవోత్సాహామార్గంలో 
ఉత్తేజాన్ని మనసకద్దుకుంటూ 
ఓ చోటే ఆగిపోక మునుముందుకు 
సాగిపోయేలా గెలుపుగీతమాలపిస్తుంటది
విరక్తిని తరిమికొడుతంది
కాయం మాయమైనా
సాధించిన విజయగీతం
ఇలలో విడిచి వెళ్ళడమే కదా మనిషి జన్మకి సార్థకం

కామెంట్‌లు