పల్లె ఆటలు సమ్మోహనం ;-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
(858-,
నేల క్యారం బోర్డు 
బోర్డు తెచ్చు అవార్డు 
అవార్డుల తలపించు సృజన యిది ఓ వనజ !

మట్టి చదునుగ చేసి 
చేసి కొలతలు వేసి 
వేసి నలువైపులా గుంతలును ఓ వనజ !

సంకేతములు గీసి 
గీసి స్ట్రెయికర్ చేసి 
చేసి సీసా మూత కాయిన్లు ఓ వనజ !

ఆటలాడే హక్కు 
హక్కు ఉన్నతి కెక్కు 
ఎక్కునే తపనతో ఒకనాడు ఓ వనజ !

గ్రామీణ క్రీడలకు 
క్రీడా ప్రాంగణముకు 
 ప్రాంగణం మురియునే ఈ తంతు ఓ వనజ !

ఆసక్తి తొలి గురువు 
గురువు కల్ప తరువు 
తరువయ్యి చేరదీసి గెలిపించు ఓ వనజ !

అ mకాడమి పెట్టాలి 
పెట్టి నేర్పించాలి 
నేర్పి మెరికల్లాగ తర్ఫీదు ఓ వనజ !

ఉన్న వనరుల తోటి 
తోటి విలువలు చాటి 
చాటి చెప్పాలిపుడు తప్పకను ఓ వనజ !


కామెంట్‌లు