వంగదేశపురాజు మంచి ఆలోచనా పరుడు ధర్మాత్ముడు. అందరినీ నిష్పక్షపాతంగా చూసే బుద్ధి ఉన్నవాడు.సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం లో దిట్ట!తన పుట్టిన రోజు కొంత మంది ని ఎన్నుకొని సన్మానాలు చేస్తాడు. ఈసారి కవిపండితులతో పాటు ఓరైతు దంపతులకు గొర్రెల కాపరికి సన్మానం చేయటం కొంత మంది పండితుల కి నచ్చ లేదు. "మేము ఇంతకష్టపడి బాల్యంనించి వేద వేదాంగాలు శాస్త్రాలు చదివాము.కంటి తుడుపుగా ఓఇద్దరికి సన్మానం చేసి మాతోపాటు రైతు దంపతులను ఓకాపరిని సన్మానం చేయటం మమ్మల్ని కించ పరచటమే!"అని లోలోపల గొణుగుతున్నారు.మంత్రి ఈమాటలు విన్నాడు. నెమ్మదిగా రాజు చెవిన వేశాడు.కాసేపు గడిచాక రాజు సభికులందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు " దేవుడు అందరికీ సమానుడే! మనసంచిత కర్మలను బట్టి మనంపాప పుణ్యాలు అనుభవిస్తాం! నేటి మనసుఖ దు:ఖాలకి కారణం మనమాటలు చేతలే! ఈపశులకాపరి నాకొడుకు ప్రాణాలు కాపాడిన వైనం వివరిస్తాను. పదేళ్ళ పిల్లలంతా ఓరోజు చెరువుకట్ట దగ్గర ఆడుకుంటున్నారు. కాలుజారి రాకుమారుడు మంత్రి కొడుకు చెరువులో పడిపోయారు.ఈతరాదు ఎవరికీ! మిగతా పిల్లలు అంతా పొలికేకలు పెడుతూ ఘొల్లుమంటుంటే ఈకాపరి మాపిల్లలని బైటకి తీసి ప్రాణభిక్షపెట్టాడు.పండితులు ఆపనిచేయగలరా?గుండెలమీద చేయివేసుకుని చెప్పండి?"రైతు దంపతులు పిల్లలందరికీ కమ్మని జొన్నరొట్టెలు గరిక పచ్చడి వేడి ఆవుపాలు ఇచ్చి వారి కడుపు నింపారు.వారిని రాజవీధి లో భటులకి అప్పగించారు. మనపిల్లలు మనకు తెలీకుండా బైట పడ్డారు ఉద్యానవనంలోంచి.అలా కవి పండితులు చేయగలరా!?" అంతే! సభలో ఒక్కరుకూడా కిక్కురుమనలేదు.మనిషి అంతస్తు స్థాయి పేదగొప్ప చదువు సంధ్యలున్నవాడా లేనివాడా అని చూడరాదు.సమయస్ఫూర్తితో చాకచక్యంగా పరోపకారం చేసేవాడు ధన్యజీవి! అలాంటి వారిని సన్మానించటం రాజు గా నాధర్మం! వారిని ఆదర్శంగా తీసుకుని ఇతరులు అడుగేయాలి". అంతే!అపోహలు తొలగిపోయి సభలోనే కాదు రాజ్యమంతా రాజు మాటలు మంత్రంలా పనిచేశాయి🌹
నిజమైన దేవుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి