🙏సర్వశక్తి మంతుడు
సర్వజ్ఞు డైనట్టి
ఈశ్వరు డెచట గలదు?
ఆత్మ బంధువు లార!(1)
🙏అంతటా వ్యాపించి
అష్ట మూర్తిగ నున్న
ఈశ్వరు డిచట గలడు!
ఆత్మ బంధువు లార!(2)
( ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ.,)
👌"ఈశ్వరుడు" అనగా సకలైశ్వర్య యుక్తుడు! అణిమాది అష్టసిద్ధులు కలవాడు! "అష్ట మూర్తు"లైన.. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవాత్మ.. అను, ఎనిమిది రూపములలో విరాజిల్లుచున్నాడు!
👌షట్ గుణవంతు డైన "భగవానుడు" ఎక్కడున్నాడు?" అని, మనమంతా పలువిధాలుగా ప్రశిస్తున్నాము!
"God" is "no where"? (గాడ్ ఈజ్ నో వేర్?) దైవము లేడెక్కడ? అని, హేతువాది, మరియు నాస్తికుడు.. అడిగిన "ప్రశ్న"లోనే; మనకు "సమాధానం" లభిస్తుంది!
"God" is "now here"! (గాడ్ ఈజ్ నౌ హియర్)! అనగా, సచ్చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడు.. ఇక్కడనే యున్నాడు! అని, భావార్ధం!
👌స్వర్ణకారుడు, బంగారంతో.. పలువిధములైన ఆభరణములను తయారుచేస్తాడు! అవి.. ఉంగరం, గాజులు, కంఠహారం.. మున్నగువాటి రూపములో నున్న బంగారం మాత్రం ఒక్కటే! అయినప్పటికి, వాటిని పలువిధము లైన పేరులతో వ్యవహరించు చున్నాము! అట్లే, పరమేశ్వరుని యొక్క విభూతులను తెలుసుకొనడం వలన; ఆరాధకులకు భగవంతుని "యథార్థ తత్వము" గోచర మవుతుంది! శివమస్తు!
⚜️ఆటవెలది పద్యము⚜️
లేడు దేవుడనెడు వాడెచ్చటను లేదు
అనుచు నొక్కి పలికె, నాస్తికుండు
"లేడు.. లేడు.. లేడు, లేడురా (చూడరా) కంసాలి!"
పసిడి ఉంగరమ్ము బదులు పలికె
( "సహజ కవి" శ్రీ నండూరి రామకృష్ణ మాచార్యులు)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి