కవిసమ్రాట్ విశ్వనాథ వారు (4) ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారు దానిలో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు  సూక్తిముక్తావళి ఎక్కువగా చేసే వారు ఏ కవి సమ్మేళనం ఏర్పాటు చేసినా దానికి అధ్యక్ష పీఠం అధిరోహించేది వారే  వారిని నియంత్రించేవాడు ఆంధ్ర దేశంలో ఎవరూ లేరు.మా జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు వీరిని జ.రు.క్ అని పిలుస్తారు. విశ్వనాథ వారిని క్ల్ఏరా అని సంబోధించే చొరవ వారికి ఒక్కరికే ఉంది. సంస్కృత ప్రాకృత పాళీ భాషలు నేర్చిన  విద్యావంతులు శాస్త్రిగారు. ఒకరోజు సూక్తిముక్తావళి కోసం విశ్వనాథ వారు మాట్లాడుతూ ఉంటే అరే నీ మొహం మండ ఏం భాషరా అది పండితుల కోసం కాదు మా కేంద్రం  పామరులు కూడా వింటారు. రిక్షా తొక్కే కార్మికుల నుంచి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పరా అని సవరించిన  సమర్థులు. ఒక కవితాగోష్ఠి కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఏర్పాటు చేసిన దానిలో దాశరథి గారు మొదటిసారిగా పాల్గొన్నారు ఆ సభకు అధ్యక్షుడు విశ్వనాథవారు. దాశరథి గారి పేరు చెప్పగానే చాలా పొట్టి గా ఉన్నాడు వాడు ఒక ఎత్తుబల్ల వేయండి లేకపోతే వాడికిమైకు అందదు వాడి చెప్పేది ఎవరికీ అర్థం కాదు అంటే  నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దాశరథి గారు చదివిన తరువాత వీడు చూడడానికి పొట్టిగానే వున్నాడు గానీ  గట్టివాడే రా భాష మీద పట్టు ఉంది అన్నారు. ఏ మాటను మనసులో దాచుకోలేరు విశ్వనాథవారు. లివ్ లైక్ ఏ చెయిల్డ్ అన్న ఆంగ్లసూక్తి ఆయనకు సరిగ్గా సరిపోతుంది.  వారు హాస్యంగా అన్న ఏ మాటను ఎవరూ పట్టించుకోరు. దానిని వారు అభినందన గానే తీసుకుంటారు దాశరథి గారు కూడా అలాగే తీసుకొని పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు అది వారి సంస్కారం. విశ్వనాథ వారితో కూర్చుని మాట్లాడుతూ ఉంటే సమయమే తెలియదు. మాకు సంస్కృతంలో తెలుగులో ఆయన చెప్పేహాస్యోక్తులు  అన్నీ ఇన్నీ కావు. నచ్చిన వారితో చాలా సన్నిహితంగా ఉంటారు. చెడ్డ వారిని దరిచేరనివ్వరు అది వారి నైజం అందుకు వారికి పాదాభివందనం.
కామెంట్‌లు