పట్టుదల;-ఎం. దీనా9వ తరగతి 'ఈ'జడ్పీ హెచ్ ఎస్ ఇందిరానగర్ సిద్దిపేటసెల్: 7671026020
 సోలాపూర్ అనే ఊర్లో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉండేవారు. తల్లి పేరు లక్ష్మీ, తండ్రి పేరు రాజయ్య. కూతురి పేరు రమ్య, కొడుకు పేరు రాము. అయితే ఒక రోజు అనారోగ్యంతో తల్లి చనిపోతుంది. రమ్య తొమ్మిదవ తరగతి చదువుతుంది. రాము ఏడవ తరగతి చదువుతున్నాడు. రాజు ఆ కెమికల్ ఫ్యాక్టరీలో కూలిగా పనిచేసేవాడు. కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అలాగే తన పిల్లల్ని చదివించేవాడు. రాము,
 రమ్య కూడా చాలా బాగా చదివేవారు. అలా రాము ఇంటర్ రమ్య, డిగ్రీ చదువుతుండగా.. రాజయ్య అనారోగ్యానికి గురవుతాడు. డాక్టర్ పరీక్ష చేసి కెమికల్ వల్ల ఊపిరితిత్తులు చెడిపోయాయి. మీ నాన్న నాలుగు సంవత్సరాలు వరకు ఎలాంటి పని చేయకూడదు. తాను విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అందుకే రాము రమ్య ఇద్దరు పని చేయడానికి వెళ్తారు. రాము కాంపౌండర్ గా, హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తాడు. రమ్య తన ఇంటి దగ్గరల్లో ఉన్న పిల్లలకు ట్యూషన్ చెప్తుంది. వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుతారు. ఒకవైపు చదువుతూనే పని చేసి డబ్బులు సంపాదించేవారు. కష్టపడి చదివి ఆరు సంవత్సరాల తర్వాత రమ్య డాక్టర్ అవుతుంది. ఆ పై తన డబ్బుతో తమ్ముడిని చదివిస్తుంది. నాన్నకి వైద్యం అందిస్తుంది. రెండు సంవత్సరాల తర్వాత తమ్ముడు అంటే రాము ఇంజనీర్ అవుతాడు. రాజయ్య ఆరోగ్యం కుదుటపడుతుంది. వాళ్లు ఆ ఊర్లోనే చాలా ధనవంతులుగా మారుతారు. రమ్య ఒక హాస్పిటల్  కట్టించి హాస్పిటల్ కి వాళ్ళ అమ్మ పేరు పెట్టి ప్రజలకు సేవచేస్తుంది. అప్పటినుండి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు.
నీతి : ఆత్మవిశ్వాసం, పట్టుదల,దృడ సంకల్పం, ఉంటే ఏదైనా సాధించవచ్చు...

కామెంట్‌లు
Laxmareddy sir చెప్పారు…
Very good beta. Super story