మధురమైన ప్రేమ ; -ఎం. వి. సత్యప్రసాద్ 9398155633.
పరంధామయ్య ఇల్లంతా హడావిడిగా ఉంది. ఈరోజు పరంధామయ్యే కూతురు కి పెళ్లి చూపులు. వచ్చేది తన సొంత చెల్లెలికొడుకే అయినా , చెల్లిని  చూసే ఎన్నో ఏళ్ళు అయింది . ఎంతో మారిపోయి వుండిఉంటుంది, ఇక  మేనల్లుడు , వాడినయితే ఎపుడో ఆరేళ్ళ పిల్లాడప్పుడు చూసాను అనుకుంటూ,  ఏమే, జానకీ ఇంకా ఎంత సేపు తయారు కావడం, అంటూ  కేక పెట్టాడు పరంధామయ్య.
వచ్చేది ఎవరో బయట వాళ్ళు కాదుగా , కానిస్తాం లెండి అంది పరంధామయ్య భార్య జానకి కూతురు లత రూమ్ లోకి వెడుతూ .
చెల్లెలు సావిత్రి , ఢిల్లీ లో ఉంటోంది , బావ కృష్ణ కి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం , ఎప్పుడూ ఆ ఉత్తర దేశం లోనే ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి.  వాళ్ళు అక్కడ ఉంటారన్న మాటే గానీ,  వాళ్ళ మనసంతా,  ఇక్కడ రాజమండ్రి మీదే ఉంటుంది. కృష్ణ వాళ్ళు,  మొదటినుండి,  ఎన్నో ఏళ్లుగా,  తాతల కాలం నుంచీ,  రాజమండ్రి పక్కన ఉన్న ఆ పల్లెటూరులోనే ఉండేవారు.  పక్కన ఊరే కదా,  దగ్గర సంబంధం,  అని పరంధామయ్య తండ్రి , కూతురు సావిత్రి ని , కృష్ణ కి ఇచ్చి పెళ్లి చేసాడు. కృష్ణ,  చిన్నప్పటి నుంచి చదువంతా రాజమండ్రి లో చదవటం మూలాన, బస్తీ వాతావరణానికి అలవాటు పడ్డాడు. డిగ్రీ వరకు రాజమండ్రి లో చదివి,  పైచదువులు మద్రాసు లో చదివాడు. అందువల్ల కృష్ణ కు వాళ్ళ ఊర్లో వ్యవసాయం అలవాటు కాలేదు .  కృష్ణ తండ్రి మటుకు, అక్కడే వ్యవసాయం  చేస్తూ,  తాను పుట్టిన ఊరు వొదిలిరాకుండా అక్కడే ఉన్నాడు.
ఇపుడు పరంధామమయ్య కూతురు లత కి, సావిత్రి కొడుకు రవి ని ఇచ్చి చెయ్యాలని, పరంధామయ్య నే,  చెల్లెలు సావిత్రి ని,  ఎన్నో సార్లు అడిగాడు.  కొడుకు రవి కి కూడా, సరయిన ఉద్యోగం లేదని , రవి పెళ్లి గురించి మాట్లాడటానికి, అన్న పరంధామయ్య ఎన్నిసార్లు అడిగినా, సావిత్రి మొగ్గు చూపలేదు. రెండు సంవత్సరాల క్రితం , రవికి బ్యాంకు లో ఉద్యోగం వచ్చింది.  గుంటూరు లో ఉద్యోగం చేస్తాడు.  రవి తల్లిదండ్రులు ఢిల్లీ లో ఉన్నా,  అమ్మమ్మ తాతయ్యలను చూడటానికి,  వాళ్ళ ఊరు వస్తూనే ఉంటాడు.
ఒక్కసారి వచ్చిపోరా,   అని పరంధామయ్య ఎన్నిసార్లు  అడిగినా,  రవికి , మేనమావ ఇంటికి వెళ్ళడానికి,  చాలా మొహమాటం గా ఉండేది . మొహమాటం అనడం కన్నా, మరదలు లత అంటే,  ఒకరకంగా ప్రేమతో కూడిన భయం,  అనే చెప్పాలి.  చిన్నప్పటి నించీ, లత అంటే రవికి చాలా ఇష్టం. కానీ ఆటల్లో,  రవిని లత ఎక్కువ అల్లరి పెడుతూ ఉండేది .  అవి,  చిన్నప్పటి ఆటల రోజులే అయినా,  డిగ్రీ లో చేరినప్పటి నుంచి,  రవి అస్సలు,  మామయ్యా ఇంటికి వెళ్ళలేదు.  లతను కూడా,  చూసి దాదాపు పదేళ్లు అవుతోందేమో.
సావిత్రి, కృష్ణ , రవి ముగ్గురూ,  సావిత్రి తండ్రి ఇంటి నుండి కార్లో,   రాజమండ్రి పెళ్ళిచూపులకని బయలుదేరారు.  రవి కారు నడుపుతున్నాడే కానీ , మనసు ఏదో ఆలోచనలో పడింది.  లత ఇప్పుడు ఎలావుందో.  నన్ను చూసి ఏమనుకుంటోందో ,  నేను నచ్చుతానో నచ్చనో .  తాను ఎవరికయినా మానసిచ్చిందో., ఇలా ఎన్నో ఆలోచనలు.   మధ్యలో ఒకసారి అయినా కలిసి ఉంటె బాగుండేది అనుకున్నాడు.  కానీ చూద్దాం .... అనుకుంటూ ఆలోచన లోంచి బయట పడ్డాడు.
రాజమండ్రి లో,  పరంధామయ్య, జాయింట్ కలెక్టర్ గా,  పనిచేస్తున్నాడు. పెద్దకూతురు లత,  డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.  లతకి ఎందుకో చిన్నప్పటి నుంచీ, టీచర్ ఉద్యోగం చెయ్యాలని మహా కోరిక.  ఈలోగా ఏమిటి ఇంకా ఆలస్యం అంటూ వెంటపడుతున్నారు పరంధామయ్య.  జానకి కూడా లతని త్వరగానే తయారు చేస్తోంది.
ఏంటమ్మా ఈ హడావిడి,  బావ ఎమన్నా నాకు కొత్త నా,  అంది చిరాకుగా లత,  అమ్మ జానకి తో.
లేదే,  ఎంతయినా,  పెళ్లి చూపులు అంటే పద్దతి గా ఉండాలి  అంటూ, నువ్వు త్వరగా రెడీ అవ్వు. అదిగో ఆ పట్టు చీర కట్టుకో,  అంది జానకి లత తో.
ఏంటమ్మా , బావ నన్ను చూస్తాడా లేక నా చీరను చూస్తాడా,  అన్నది లత కొంచెం వాదించే ధోరణి లో.
సరేలే , ఎదో ఒకటి కట్టుకుంటాలే అంది లతా కొంచం చిరాగ్గా
ఖర్మ, చెపితే వినదు కదా, మొండిపిల్ల, తాను ఏదనుకుంటే, అదే చేస్తుంది అని తలకొట్టుకుంటూ,  వంటింట్లోకి వెళ్ళింది జానకి.
అమ్మకి సహాయం చేస్తోంది జానకి రెండో కూతురు ప్రియా.  పెళ్లి వాళ్లకి పెట్టాల్సిన స్వీట్లు, కారాలు,  అన్నీ రెడీ చేస్తోంది.
నువ్వు రెడీ అవ్వవెంటే,  అంటూ కసిరింది జానకి, ప్రియని చూసి.
పెళ్లి చూపులకే ఇంత గొడవ చేస్తోంది, ఇక పెళ్లి అంటే ఎంత కంగారు పడుతుందో అని గొణుక్కుంటూ వెళ్ళింది ప్రియ.
సావిత్రి వాళ్ళు పరంధామయ్య ఇంటికి వచ్చారు.
బాగున్నారా బావగారూ, అంటూ కారు దగ్గరకే వచ్చి పలకరించి,  లోపలి రమ్మని పిలిచాడు,  పరంధామమయ్య . సావిత్రి రామ్మా, రవి రా బాబు అంతో ఏంటో ఆప్యాయత తో పలకరించాడు,  పరంధామయ్య. బాగున్నారా మామయ్యా అంటూ పలకరించాడు  రవి తన మామయ్యను.  రవి కి మామయ్యా అంటే ఎంతో గౌరవం, ఇక అత్తయ్య అంటే చిన్నప్పటి నుంచీ ప్రాణం. అమ్మకన్నా ఎక్కువ.
కూర్చోమని హాల్లో సోఫా చూపించాడు పరంధామయ్య.  ఈలోగా ప్రియ స్వీట్లు, కార, మంచినీళ్లు పట్టుకు వచ్చింది.
ఎందుకు బావ ఈ ఫార్మాలిటీస్ అన్నీ,  అన్నాడు ఎంతో ప్రేమతో కృష్ణ.
ఏదోలే బావా, ఇది మా సంతోషం .... అంటూ నవ్వేసాడు పరంధామయ్య.
ఈలోగా జానకి కూడా వచ్చి , వచ్చిన అందరినీ పలకరించింది.
లత రూమ్ లోకి వెళ్ళింది జానకి , ఈ పిల్ల తయారైందో లేదో అనుకుంటూ.
అలాగే ఉన్నావేంటే , ఆ పట్టు చీర కట్టుకో అంది జానకి లత తో.
ఇది చాల్లెమ్మ అంది లత తాను కట్టుకున్న చీర చూపిస్తూ.  పట్టు చీర కాదు కానీ,  చాలా మంచి చీర కట్టుకుంది లత.  లత వి , ఆలోచనలు, భావాలు, చాలా  గొప్ప గానే ఉంటాయని చెప్పాలి.  అందానికి కాదు, మనసుకు విలువ ఇవ్వాలి, గుణం గొప్పదయి ఉండాలి అంటుంది.  కొంచం ఖచ్చితం గా మాటాడే అలవాటు, మనసులో ఏదీ దాచుకోదు.  అలాగని కడిగి పారేస్తోంది అనడానికి లేదు.  విలువలకు ప్రాముఖ్యత ఇస్తుంది. తన మనసు చెప్పింది చేస్తుంది. తన వయసుకు లతాది గొప్ప వ్యక్తిత్వం అనే చెప్పాలి. గొప్పగా మేకప్ లు, ఆర్భాటాలు చెయ్యకుండా, మొహానికి కేవలం ఫెయిర్ & లవ్లీ మటుకు రాసి, పౌడర్  రాసుకుని  వీళ్ళందరూ ఉన్న హాల్ లోకి వచ్చింది.
రవిని చూడగానే, ఒక్కసారి నవ్వు వచ్చి , ఆపుకుంది.  తాను ఏడిపించిన రవి గుర్తొచ్చాడు. మనిషి బాగా పొడుగయ్యాడు. నీట్ గా , హుందా గా ఉన్నాడు. ఎం మాట్లాడకుండా,  ముభావంగా కూర్చున్నాడు. అదేదో తెచ్చి పెట్టుకున్న గాంభీర్యం లాగా వుండి,  రవి ని చూస్తుంటే లతా నవ్వు ఆపుకోలేక పోతోంది .
ఇక్కడ రవి పరిస్థితి,  లత ను చూడగానే , చిన్నప్పుడు నన్ను ఏడిపించిన లత , తనేనా, ఎంత అందం గా వుంది అనుకుంటూ లతనే చూడ సాగాడు, మంచి రంగు వచ్చింది. కోలా మొహం,  ఒత్తుగా ఉన్న పొడవైన జడ.  ఈరోజుల్లో జుట్టు కత్తిరించుకుని, జీన్స్ ప్యాంటు లు వేసుకునే ఆడవాళ్లను కూడా చూసాడు. వాళ్ళ తో పోల్చకూడదు కానీ , లత ను అదేపని గ చూడసాగాడు.
తినేస్తావేంట్రా అమ్మాయిని , అడిగింది సావిత్రి,  రవి తో.
కొంచం సిగ్గుపడి తల తిప్పుకున్నాడు రవి .
సామాన్యం గా,  ఆడపిల్ల తల ఎత్తి పెళ్ళికొడుకుని ఒకసారి చూసి , నచ్చారు లేదా నచ్చలేదు అనే రోజులు పోయాయి.  ఇపుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ,  ఒకరితో ఒకరు మాట్లాడు కుంటున్నారు పెళ్ళిచూపుల్లోనే. మాట్లాడడు కోవడం లో కొంత అయినా అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. అదేవిధం గా మీరిద్దరూ మాట్లాడు కోండిరా, అన్నాడు చనువుగా పరంధామయ్య రవిని ఉద్దేశించి.
ఎం లేదు మామయ్యా , అన్నాడు రవి.
ఎమ్మా నువ్వు ఏమైనా మాట్లాడమ్మా అన్నాడు కృష్ణ , లతను చూసి.
సిగ్గుతో లోపలి వెళ్ళిపోయింది లత.
పిల్ల, పిల్లాడు సరే అనుకున్నారు కాబట్టి,  తాంబూలాలు పుచ్చుకుందాం అనుకున్నారు ఇరు వైపులవారూ.
ఇంతలో,  లత నెమ్మదిగా గొణగడం మొదలుపెట్టింది.
ఏంటి చెప్పమ్మా,  అన్నాడు కృష్ణ లత ను ఉద్దేశించి.
లతను పరిశీలనగా చూస్తున్నాడు పరంధామయ్య,  ఏమీ అర్థం కానట్టు.
నేను నచ్చలేదా తనకి అనుకుంటూ,  కొంచం కంగారు పడ్డాడు రవి.  రవికి లత అంతగా నచ్చేసింది.
సావిత్రి ఏమీ అర్థం కానట్టు లత ను చూస్తోంది సావిత్రి  .
ఎం పెటకం పెడుతుందో ఏంటో .. అనుకుంటూ దేవుళ్ళకి దండాలు పెడుతోంది జానకి.
నాకు టీచర్ ఉద్యోగం చెయ్యాలని వుంది, టీచర్ అవ్వాలని వుంది. ఉద్యోగం వచ్చినా రాకపోయినా,  BEd చదువు అయ్యాక పెళ్లి చేసుకుంటాను బావని అంది, లత.
అంటే మూడు ఏళ్ళు ఆగాలన్నమాట,   అన్నాడు కృష్ణ.
ఏరా, మరి నువ్వు ఏమంటావ్ అంది సావిత్రి రవిని చూసి.
ఇదేం గొడవే బాబూ, ఏ, పెళ్ళయితే చదువుకోకూడదా , ఎంతమంది అలా చదువుకోవట్లేదు అంది జానకి లత తో.
లత మౌనంగా వుంది. నే చెప్పాల్సింది చెప్పేశా, నాన్న ఎప్పుడూ నా మాట, కోరిక కాదనరు,  అనుకుంది మనసులో.
సరేనమ్మా, నీ చదువు అయ్యాకే పెళ్లి, సరేనా అన్నాడు కృష్ణ, లత తో.
సన్నగా నవ్వి ఊరుకుంది లత.
కొంచం నిరాశ పడ్డా , బయట పడకుండా మేనేజ్ చేసాడు రవి.
ఇరువర్గాల వారూ సంతోషం గా తాంబూలాలు పుచ్చుకోకపోయినా, సరే అనుకున్నారు.  
మాట్లాడుకోడం  అయ్యాక, భోజనాలు ముగించుకుని , సావిత్రి, రవి, కృష్ణ ముగ్గురూ బయలుదేరారు.
లత,  డిగ్రీ రెండో ఏడు పూర్తిచేసి,  మూడో సంవత్సరానికి వచ్చింది.  రవి దాదాపు రోజూ మెసేజ్ లు పెడుతున్నాడు.  లతకి , మెసేజ్ లో మాట్లాడటం అలవాటు చేసాడు రవి.  రోజులు హ్యాపీ గా గడుస్తున్నాయి లత. రవి తో చాటింగ్ లో పది చదువు కూడా కొంచం వెనక పడింది లత.  
ఒకరోజు జానకి, నడుం నెప్పి, కాలు నెప్పి అని చాలా బాధపడటం మొదలుపెట్టింది. రాజమండ్రి లో ఉన్న,  మంచి ఎముకల డాక్టర్ దగ్గర చూపించారు .  నడుం నెప్పి, మోకాలు నెప్పి కి టాబ్లెట్స్ ఇచ్చారు డాక్టర్ గారు. అమ్మను పనిచెయ్యనీకుండా,  ఇంటిపని, బయట పని అంతా లత, ప్రియ ఇద్దరూ చేస్తున్నారు.  లతకి చాలా ఒత్తిడి పెరుగుతోంది. అమ్మ కి రెస్ట్ ఇవ్వాలని పనంతా థానే చేస్తోంది. వంట చేయడం రాదు లతకి,  మీరు చదువుకోండి అంటూ అమ్మ అన్నిపనులు , జానకి  థానే చేసుకునేది.  మాకోసం తన జీవితాన్ని ధారపోసి, ఇలా నెప్పులు తెచ్చుకుంది, అంటూ అమ్మ కోసం, చాలా తాపత్రయ పడుతుంది లత. తనకూ ఒకపక్క చదువు, ఇంటిపని, వంటపని ఈ ఒత్తిడి లో రవి తో మాట్లాడటానికి కాదుకదా,  కనీసం మెసేజ్ పెట్టడానికి కూడా టైం దొరకట్లేదు.
జానకి కి , మోకాలు నెప్పి మరీ ఎక్కువ అయ్యింది.  డాక్టర్ కు చూపిస్తే,  మోకాలు ఆపరేషన్ చెయ్యాలన్నాడు. చేస్తే గానీ ఆ నెప్పి తగ్గదు అన్నారు.
ఎం చేద్దాం నాన్న అంది లత పరంధామయ్య ని ఉద్దేశించి.
మంచి డాక్టర్ ను చూసి ఆపరేషన్ చేయించాలమ్మ, అన్నాడు పరంధామయ్య లత తో.
ఇక్కడ రాజమండ్రి లో ఎవరున్నారు నాన్న,   అంది లత.
ఇక్కడ లేక పొతే హైదరాబాద్ లో మా ఫ్రెండ్ కి తెలిసిన ఎముకల డాక్టర్ ఒకరు  ఉన్నారు,  కనుక్కుందాం అన్నడు పరంధామయ్య లత తో
మీ ఫ్రెండ్ తో మాట్లాడి, రేపే అప్పోయింట్మెంట్ తీసుకోండి నాన్న,  అంది తండ్రి తో లత.
మరుసటి రోజు పరంధామయ్య ,  పదిహేను రోజుల తర్వాత డేట్ లో అప్పోయింట్మెంట్ , హైదరాబాద్ హాస్పిటల్ లో దొరికిందమ్మ అన్నాడు లత తో పరంధామయ్య.
కనీసం రెండు రోజులు ముందు గా అన్న వెళ్ళాలి కదా నాన్న,  అంది లత తండ్రి తో.
అవునమ్మా అన్నాడు పరంధామయ్య.
ఆపరేషన్ కి ముందు రెండు రోజులు, అయిన తర్వాత,  కనీసం వారం రోజులు అయినా హైదరాబాద్ లో ఉండాలి కదా, హోటల్ లో రూమ్ తీసుకుని ఉండటం అంటే చాలా ఖర్చు అవుతుంది.  ఆపరేషన్ , మందులకు బోలెడు అవుతుంది.  పైగా హోటల్ ఖర్చులంటే ఇంకా కష్టం కదా నాన్న , అంది లత తండ్రి తో.
   
హోటల్ అవసరం లేదమ్మా,  మోహన్ అని,  మా స్నేహితుడు ఒకడు,  హైదరాబాద్ లో ఉంటున్నాడు. వాళ్ళు త్రి బెడ్ రూమ్ హౌస్ లో ఉంటున్నారు. వాడితో మాట్లాడాను, ఒక రూమ్ మనం వాడుకుకోవచ్చు అని మనకు ఆ రూమ్ ఇస్తానన్నాడు, అన్నాడు పరంధామయ్య.
పోనీలే నాన్న, ఆ మాత్రం సహాయం చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, అంది లత .
లేదమ్మా, వాడు చాలా మంచివాడు. వాళ్ళు పేదవాళ్ళు గా ఉన్నపుడు, మా నాన్నగారు వాళ్లకు,  వాడు చదువుకోడానికి,  ఇతర అవసరాలకూ చాలా డబ్బు సహాయం చేశారు. వాడు వేరే కాలేజీ లో చదివినా, మేమిద్దరం ఒకే ఏడాది డిగ్రీ పాస్ అయ్యాము.  ఇపుడు వాడు మంచి స్థితి లో ఉన్నాడు.  వాళ్ళ అబ్బాయి కూడా,  ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు.  ఒకే వారం పది రోజులు,  మనకు ఆశ్రయం ఇవ్వడానికి సంతోషం గా ఒప్పుకున్నాడు, అన్నాడు పరంధామయ్య, కూతురు లత తో.
పోనీలే నాన్నా, మనం ఎప్పుడో , అదీ తాతగారు చేసిన సహాయం గుర్తుపెట్టుకుని, ఈరోజు మీరు అడిగిన దానికి,  వెంటనే ఒప్పుకున్నారు. ఎదుటి వారికి మనం ఏది ఇస్తే ఆదిమనకు ,  ఏదో ఒక రోజు తిరిగి వస్తుందంటారు,  ఇదేనేమో అంది నాన్నతో,   లత.
ఎంత ఎదిగిపోయింది లత, అని ఆశ్చ్యర్య పోయాడు, ఎంతో సంతోష పడ్డాడు పరంధామయ్య,  కూతురు లతను చూసి.
                                             
                                                                        * * * * *
ఆపరేషన్ చెయ్యాల్సిన రోజు రానే వచ్చింది , మూడు  రోజులు ముందుగానే హైదరాబాద్ చేరుకున్నారు  పరంధామయ్య, జానకి, లత, ప్రియ.   మోహన్,  వీళ్ళను రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకుని, తన కార్ లోనే ఇంటికి పిలుచుకు వచ్చాడు.
వీళ్ళని ఎంతో ఆధారంగా రిసీవ్ చేసుకుంది మోహన్ భార్య మాధవి.  భోజనాలు చేసి అందరూ కూచుని మాటాడుకుంటున్నారు. ఈలోగా ఒక కుర్రాడు ఇంట్లోకి వచ్చాడు.  అతన్ని మోహన్ పరిచయం చేసాడు,  తన కొడుకు కిరణ్,  అని అందరికీ.  కుర్రాడు మంచి హైట్ ఉన్నాడు. ఆరడుగులు కి కొంచం తక్కువ ఉంటాడేమో, తొందరగా అందరినీ ఆకర్షించాడు. చాల పద్ధతి గా ఉండే మనిషి లాగా కనిపిస్తున్నాడు.
నమస్తే,  చెప్పాడు అందరికీ కిరణ్.
డ్రెస్ మార్చుకుని,  వచ్చి కూర్చున్నాడు కిరణ్ .  పరంధామయ్య గారి గురించి, వాళ్ళ ఫామిలీ హైదరాబాద్ , సర్జరీ కోసం వచ్చిన విషయం గురించి చెప్పాడు మోహన్
మీరు సర్జరీ చేయించే హాస్పిటల్ లో,  మా ఫ్రెండ్ ఒకడు,  డాక్టర్ గా పనిచేస్తున్నాడు,  నేను అతనితో కూడా మాట్లాడుతాను, మనకు కాస్త హెల్పఫుల్ గా ఉంటాడు,  అన్నడు  కిరణ్.
మోహన్ అందరినీ,  పేరు పేరునా పరిచయం చేసాడు కిరణ్ కి.
ఇంక రెస్ట్ తీసుకోండి , రేపు హాస్పిటల్ కి వెళ్ళాలి కదా అన్నాడు మోహన్.
వీలయితే నేనూ వస్తాను అన్నాడు కిరణ్.
                                                   * * * *
మరుసటి రోజు అందరూ హాస్పిటల్ కి వెళ్లారు.  సర్జన్ అన్ని టెస్ట్ లూ చేసి,  రెండు రోజుల తర్వాతి రోజు డేట్ ఇచ్చారు. కానీ అంత పెద్ద హాస్పిటల్ లో కిరణ్ ఒక్కడూ, తన ఫ్రెండ్ డాక్టర్ పరిచయం ని ఉపయోగించి,  అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ,  పనులు త్వరగా పూర్తి చేయించాడు.  లేకుంటే ఆ టెస్టులు అన్నీ పూర్తి చెయ్యాలంటే  రెండో రోజు కూడా రావాల్సి వచ్చేది.
ఆపరేషన్ చేయించాల్సిన రోజున,  మధ్యాహ్నం టైం ఇచ్చారు. కానీ ఉదయాన్నే రెమ్మన్నారు హాస్పిటల్ కి.  ఉదయం తొమ్మిది గంటలకు ఉండేటట్లు ప్లాన్ చేసి , కిరణ్ వాళ్ళ కార్ తో పాటు మరో కార్ కూడా బుక్ చేసి అందరూ బయలుదేరారు హాస్పిటల్ కి.  
ఆంటీ ఎం భయపడొద్దు , ఇక్కడ ఆపరేషన్ చాల బాగా చేస్తారు . మీరు ఏమీ కంగారు పడొద్దు. అన్నీ నేనూ చూసుకుంటాను,  అని ఎంతో దేర్యం చెప్పాడు కిరణ్.
ఆపరేషన్ పూర్తి అయ్యేసరికి, సాయంత్రం నాలుగు గంటలు అయ్యింది.  డాక్టర్లు జానకిని, మరుసటి రోజే నడవాలని చెప్పి నర్సుల సహాయం తో నడిపించారు . .
లత, జానకిని నడిపించడానికి ప్రయత్నిస్తోంది. కానీ జానకి నొప్పి అని చెప్పి , సహకరించడం లేదు.  అమ్మను నడిపించడం,  లతా, ప్రియా లకు  కుదరటం లేదు.  కిరణ్ ఇంక,  జానకిని నడిపించే బాధ్యత కూడా,  తీసుకున్నాడు .  ఆమెకు,  వీలయినంత వరకు సహాయం చేసి, ఆంటీ మీరు నాకోసం రెండు అడుగులు వెయ్యండి , అని చిన్న పిల్లడు బ్రతిమిలాడినట్లు అడిగి , ఎన్నో కబుర్లు చెప్పి, జానకికి నెప్పి తెలియనీకుండా చేసి,  నడిపించాడు.  కిరణ్ చేసే పద్దతి , మాటాడే విధానం, చూపించే  లతకి ఎంతో ఆశ్చర్యం కలిగించాయి.
ఇంట్లో వాళ్ళం కూడా అంత ప్రేమగా, బ్రతిమిలాడి, బుజ్జగించి నడిపించడం చేయలేకపోతున్నాం , కానీ కిరణ్,  తన సొంత ఇంటి మనుషులను చూసుకున్నట్లు చూసుకుంటున్నాడు .  జానకి ని డిశ్చార్జ్ చేసే టైం లో,  పరంధామయ్య గారికి , మోహన్ , కిరణ్ ఇద్దరూ దగ్గరుండి హాస్పిటల్ లో అన్ని పనులూ చూసుకున్నారు.  తండ్రి తో సహా  లత, ప్రియ ఇద్దరూ ప్రేక్షక పాత్ర పోషించారు,  అని చెప్పవచ్చు.   మోహన్, కృష్ణ, ఇద్దరూ ఎంతో జాగ్రత్త గా జానకి ని ఇల్లు చేర్చారు.
మోహన్ ఇంట్లో,  మోహన్ భార్య ఎంతో ఆదరంగా ,  వీళ్ళందరికీ సేవ చేస్తోంది.  మాధవి కి కొంచం అన్నా సహాయం చేద్దాం అని,  వంటింలోకి వచ్చి ఏదో పని అందుకోబోయింది లతా.
నువ్వెందుకు , నేను చేసుకుంటా లేమ్మా,  అంది మాధవి లతా తో.
ఏదోలోఈ ఆంటీ , మేమందరమూ ఒక్క సారి రావడం తో,  మీకు పని ఎక్కువ అయింది , ఏదయినా,  నాకు చేతనయినంత పని చేద్దాం,  అని వచ్చాను అంది లత.
ఎం వొద్దులే గానీ,  నువిక్కడ కూచుని కబుర్లు చెప్పు,  అంది మాదహవి లతను  అరుగు మీద కూచోమని చెప్పి.
అవును ఆంటీ, కిరణ్ టెన్నిస్ ఆడతాడా అడిగింది లత.
లేదమ్మా, ఎం ఎందుకలా అడిగావు ,  అంది మాదవి.
ఏంలేదు, అక్కడ గోడకు టెన్నిస్ బాట్ తగిలించి ఉంటేనూ, అంది లత.
అదా, మీ అంకుల్ ఆడేవారు అంది మోహన్ ను ఉద్దేశించి.
కిరణ్ గారు ఆడతారేమో అని అనుకున్నాను,  అంది లత.
లేదమ్మా , కిరణ్ కి క్రికెట్ అండ్ పిచ్చి,  మీరు వచ్చారని,  వాడిని కాస్త ఇంటిపట్టున ఉండమంటున్నాను,  వాడు ఎప్పుడూ ఆ గ్రౌండ్ లోనే పడి ఉంటాడు.  ఒక్కోసారి,  వాళ్ళ ఆఫీస్ తరుపున కూడా క్రికెట్ ఆడతాడు.  ఎన్నో కప్పులు  తెచ్చాడు,  అదిగో,  ఆ షోకేస్ లో ఉన్న కప్పులన్నీ,  వాడు తెచ్చినవే, అంది మాధవి.
లత కి కూడా క్రికెట్ అంటే మహా ఇష్టం,  దాదాపు అన్ని మ్యాచ్ లూ, టీవీ లో చూసింది.
ఈలోగా,  ఆంటీ ఎలా ఉన్నారు , అంటూ జానకి గది లోకి వచ్చాడు కిరణ్.  
జానకి ఒక్కతే,  బెడ్  మీద కాలు జాపుకుని కూచుని,   ఎదో పుస్తకం చదువుకుంటోంది. మరెవరూ లేరు అక్కడ . లత మాధవి దగ్గర కబుర్లు చెబుతోంది. పరంధామయ్య, ప్రియా ఇద్దరూ, జానకి ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన  మరుసటి రోజే రాజమండ్రి వెళ్లిపోయారు.
కిరణ్ గొంతు విని,  జానకి ఉన్న గదిలోకి వచ్చింది లత.
ఎందుకో తెలీదు కానీ , లత కి , కిరణ్ గొంతు వింటేనే ఏదో ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటోంది, ఈ మూడు రోజులు గా,  కిరణ్ జానకి మీద చూపిస్తున్న వాత్సల్యానికి , మొదట కృతజ్ఞతా భావం తో కిరణ్ తో క్లోజ్ గా మూవ్ అయిందేమో, కిరణ్ మాట్లాడితే,  ఎంతో హాయిగా ఉన్నట్లు అనిపిస్తోంది ఇవాళ .  కిరణ్ కూడా ప్రతి మాటా,  సామాన్యంగా జోక్ లాగ,  నవ్వొచ్చేటట్లు మాట్లాడుతాడు.  వయసులో ఉన్నారేమో , లత దగ్గర మాటాడేప్పుడు కొంచం జోక్స్ ఎక్కువ వదులుతాడు.
లత , కిరణ్ యొక్క ప్రతి కదలికనూ గమనిస్తుంది.  లతకి ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తోంది , కిరణ్ మీద మనసు పారేసుకుందా అని.  ఎన్ని సార్లు ఆలోచించినా, ఔను , అనే సమాధానమే వస్తోంది. చాలా సార్లు,  కిరణ్ తో ఏదో ఒక పనిమీద,  స్కూటర్ వెనక కూచుంది, కానీ,  ఎప్పుడూ కిరణ్ తనతో తప్పుగా ప్రవర్తించ లేదు. ముఖ్యం గా కిరణ్ ప్రవర్తన , నడవడిక చూసి కిరణ్ తో ప్రేమలో పడిపోయింది లత.  చెప్పాలంటే, ఎన్నో కారణాలు ఉన్నాయి కిరణ్ ను ఇష్టపడటానికి.   కిరణ్ లో ఏమాత్రం స్పందన కనబడక పోయే సరికే , కిరణ్ ఇంకెవరికయినా మానసిచ్చాడేమో అనిపిస్తుంది.
ఛ, ఇదేంటి , నేను ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంది లత మనసులో. కిరణ్  ఏంవారికి మానసిస్తే తనకేంటి. తాను వచ్చింది అమ్మకు ఆపరేషన్ చేయించి, జాగ్రత్త గా ఇంటికి తీసుకెళ్లడానికి.  కానీ ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తున్నాయి. ఒక పక్క రవి తో ఎంగేజ్మెంట్ అవకాకపోయినా ఒకళ్ళని ఇంకొకళ్ళు శర అనుకున్నారు.  అలాటిది,  వేరే మనిషి మీద మనసు పడ్డట్టు ఆలోచనలు వస్తున్నాయి.  రవి , కిరణ్  లాగ సరదాగా ఉండడు. కానీ లత అంటే రవి కి చాలా ప్రేమ. కానీ రవి తో పరిచయం కేవలం నిరుడు వాళ్ళు లతా వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచే . అంతక్రితం ఎప్పుడో చూసింది రవిని . ప్రేమించడం అంటే ఏమిటో లతకి తెలీదు. పెద్దవాళ్ళు రవితో పెళ్లి నిర్ణయించారు కాబట్టి , రవి తో అనుబంధం పెరిగింది.  అదీ కూడా ఫోన్ లో మాట్లాడుతుంటాడు, మెసేజ్ లు పెడుతూ ఉంటాడు. కానీ కిరణ్ తో ఏర్పడిన బంధం  అలాటిది కాదు . తన మనసంతా కిరణ్ చుటూ తిరుగుతోంది  
కిరణ్ చూపులో ప్రేమ ఉంది, పలకరింపుతో ఆప్యాయత ఉంది,  మాట లో, మాటాడే  స్వరం లో ఒక మృదుత్వం,  ఆ స్వరం వింటుంటే ఏదో తెలియని ఆనందం ఉంది.  కిరణ్అ అప్పుడప్పుడు కూనిరాగాలు తీస్తూ ఉంటాడు. తన గొంతులో కూనిరాగాలు అయిన చాల బాగుంటుంది అనిపిస్తుంది .కానీ ఎప్పుడూ కిరణ్ పాడగా తను  వినలేదు.  కనీసం పాటలగురించి కూడా మాట్లాడలేదు.   నడక కూడా చాల బాగుంటుంది , . అలా అని తాను కావాలని తెచ్చిపెట్టుకునట్టు , సిమిమా హీరోలను ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించదు.  మాట చాలా సున్నితం గా మాట్లాడుతాడు , వాళ్ళ అమ్మగారి పోలిక అనుకుంటా, ఆవిడ కూడా అలాగే మాటాడుతారు .   కానీ కిరణ్ థన్ గురించి ఏమనుకుంటున్నాడో తెలియడం లేదు. కానీ ఏ అభిప్రాయం ఉన్న తాను బయటపడ్డాడు అనుకుంది లతా.
జానకి ఇక రేపే తిరుగు ప్రయాణం. లతా మొహం లో దిగులు స్పష్టంగా కనబడుతోంది.  చూస్తుంటే లతకి , కిరణ్ కూడా దిగులుపడుతున్నట్లే అనిపించింది.
జానకి దగ్గరకు వచ్చి , ఆంటీ రాజమండ్రి వెళ్ళాక బాగా నడవండి,  అక్కడ నేడు ఉండను నడిపించడానికి, మీరే నడవాలి అన్నాడు కిరణ్.
అలాగే బాబు, నడుస్తాను . ఒకసారి రారాదు రాజమండ్రి మా యింటికి సరదాగా అంది జానకి.
వస్తాను ఆంటీ తప్పకుండ , అన్నాడు కిరణ్.
మా లతా, ప్రియా నీకు తోడు ఉంటారులే కబుర్లు చెప్పడానికి అంది గదిలోకి వస్తూన్నలతను చూసి.
ఒకసారి మా ఇంటికి రండి కిరణ్ల గారు అంది లత.
లత, కిరణ్ ఇద్దరూ అలా మాట్లాడుతూ జానకి గది లోంచి బయటకు వచ్చారు.
కిరణ్ గారు , రేపే మా ప్రయాణం, మీరు మా అమ్మ ఆపరేషన్ కి , ఇంటికి వచ్చాక కూడా ఎంతో సహాయం చేశారు మీకు మేము ఎంతయినా రుణపడి ఉంటాము అంది.
అయ్యో , అదేం లేదండీ , మీరు మాకు ఎంతో ఆప్తులు, మీతో ఈ నాలుగు రోజులు గడిపింది,  నాకు కూడా మనసుకు ఎంతో ఆనందం, ఉత్సాహం ఇచ్చింది.  ముఖ్యం గా మీ నడవడిక, మాట తీరు,  మీరు చూపిస్తున్న అభిమానం ,  నాకు బాగా నచ్చింది. అన్నాడు కిరణ్.  అన్నాడే కానీ , తొందర పడ్డానేమో , ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అని ..... వెంటనే లత తో సారీ , ఏమీ అనుకోకండి , వేరే ఉద్దేశ్యం కాదు, మీరు మీ మంచితనం , మీ స్నేహం బాగా నచ్చాయి,  అన్నాడు . అలా అన్నాడే కానీ,  లత అంటే ఏదో ఒక మూల ఇష్టం ఉంది.  అలాగని ప్రేమిస్తున్నాడని చెప్పలేము.
నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆంటీ కి ఎలా ఉందొ అప్పుడప్పుడు ఫోన్ చెయ్యండి అన్నాడు కిరణ్.
తప్పకుండా, అని కిరణ్  ఫోన్ నెంబర్ తీసుకుని, తన ఫోన్ నెంబర్ కిరణ్ కి ఇచ్చింది.
ఒక గంట అయ్యాక,  నేను ఎక్కువగా ఫోన్ చెయ్యను, మెసేజ్ లు పెడతాను , ఎక్కువగా క్లాస్ లోన్ ఉంటె మాట్లాడటానికి కుదరదు, మీరు కూడా రిప్లై మెసేజ్ ఇవ్వండి అంది లత కిరణ్ తో. ఫోన్ మాట్లాడితే మా కాలేజీ లో ఒప్పుకోరు.
అవును , నాకు కూడా , ఆఫీస్ లో మాట్లాడటానికి కుదరదు , మెసేజ్  పెట్టడం ఇబ్బంది ఎం కాదు అన్నాడు కిరణ్.
జానకి , తిరిగి రాజమండ్రి బయలు దేరాల్సిన రోజు ఉదయం, పరంధామయ్య గారు,  హైదరాబాద్ వచ్చారు జానకి ని పిలుచుకు వెళ్ళటానికి.  హైదరాబాద్ నుండి రాజమండ్రి కి కారు  మాటాడుకుని , బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు బయలుదేరే టైం కి మోహన్ , కిరణ్ ఇద్దరూ ఇంటిదగ్గరే ఉన్నారు.
బయలుదేరడానికి ఇంకా గంట టైం ఉంది, భోజనం చేసుకుని బయలు దేరుదాం అని దానికి తగినట్టుగా కార్ అతన్ని రమ్మన్నారు.
లత ఎంతో దిగులుగా,  కిరణ్ నే చూస్తోంది. ఎక్కడ తాను,  కిరణ్ ను చూడటం అమ్మ, నాన్న చూస్తారో అని భయపడుతూనే ఉంది. లత కి దాదాపు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకో రవి తో పెళ్లి అనుకున్నా,  కిరణ్ లో ఏదో గొప్పతనం, ప్రేమ, ఆత్మీయత, అభిమానం, అనురాగం, మమతా ... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉన్నాయని అనిపిస్తోంది.  అవన్నీ తాను ఇపుడు కనులారా చూసింది, ఆ ప్రేమను ఫీల్ అయింది.  కానీ తనకు కిరణ్ ఇంతగా నచ్చ్చాడని ,  ఈ నాలుగు రోజులలో తనకే తెలియ లేదు. ఇవాళ వదిలి వెళ్లాలంటే ఎంతో బాధ గా ఉంది.
నేను మళ్ళా, ఇంకొకసారి హైదరాబాద్ వస్తాను , నాకు మీ బండి మీద హైదరాబాద్ అంతా చూపిస్తారా ..అడిగింది లత కిరణ్ ని.
తప్పకుండ,  రండి చూపిస్తాను అన్నాడు కిరణ్.
మీరు నన్ను రండి అనొద్దు , నేను మీకన్నా చిన్న దాన్ని అంది లత.
కాదులెండి .....అని ఎదో చెప్పబోతే... ప్లీజ్ అని ఆపేసి, అంది అనొద్దండి అన్నది.
కిరణ్ కి మనసులో ఎంతో సంతోషం వేసింది, కానీ బయటపడలేదు.  తాను అందరినీ ఎంతో గౌరవంగా పిలుస్తాడు. ఏకవచనం లో పిలవటం అలవాటులేదు.  ఎంతో కావాల్సిన వాళ్లనే ఏకవచనం తో పిలుస్తాడు.
ఓకే ...అలాగే లెండి అన్నాడు కిరణ్.
సీరియస్ గా చూసింది లత.
ఓహ్..సారీ.. అలాగే లతా ! అన్నాడు కిరణ్.  లత మొహం లో ఆనందం ఎంతో స్పష్టం గా కనబడింది. తనని బండి మీద హైదరాబాద్ లో తిప్పమని అడగటం, కిరణ్ కి మనసులో లత మీద ఒక ప్రేమ పూరితమైన అభిప్రాయాన్ని ఏర్పరిచింది.
చేరగానే మెసేజ్ పెట్టు లతా , అన్నాడు కిరణ్ లత తో.
కోటి వీణలు తన మదిలో  మోగితే ఇలాగే ఉంటుందేమో, ఎదో సంతోషం ,  ఆ గొంతులో ఆప్యాయత , మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరం లో మాధుర్యం,  పిలుపులో కూడగట్టుకున్న ప్రేమ , అన్నిటినీ ఒక్కసారిగా అనుభూతి పొందింది లత.  నా అన్న వాళ్ళ తో ఎంత ప్రేమ చూపిస్తారో అంత
అలాగే ,  అని అన్నాను అనుకుంది లత.  కానీ నోట్లోంచి మాట రాలేదు, తల ఊపడం మటుకు చేసింది.
సన్నటి చిరునవ్వు నవ్వాడు కిరణ్ , ఎవ్వరికీ  కనబడ కుండా. మెసేజ్ పెట్టమని చెప్పాడే కానీ , లత, జానకి  ఆంటీ వాళ్ళు వెళ్లిపోతుంటే మనసులో ఏదో దిగులు గా ఉంది .  తప్పదు కదా, వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళాలి.
లత, జానకి, పరంధామయ్య ముగ్గురూ కారులో బయలుదేరారు. లత అలా కిరణ్ నే వెనక్కి చూస్తూ ఉండిపొయింది. కళ్ళలో నీళ్లు వచ్చినట్లు అనుమానం వచ్చి,  ఎవరికీ కనబడకుండా తుడుచుకుంది.  ఆలోచనలో పడింది లత . ఏంటో ఈ బాధ, ప్రేమలో ఇంత తపన ఉందా. ఇది ఆకర్షణ కాదు.  మనసు నిండా ప్రేమ,  మూర్తీభవించిన కిరణ్ రూపం, కిరణ్ వ్యక్తిత్వం.  ఇంత మంచివాడు ,  అర్థంచేసుకుని  మనసుకలవ్యక్తి దొరకడం కష్టం అనిపిస్తుంది. రవి మంచి వాడు కాదు,  అనికాదు కానీ,  రవి గురించి పూర్తి అవగాహన రాక ముందే కిరణ్ తో సన్నిహితం ఏర్పడింది.  అందుకే తాను ఆకర్షితురాలు అయ్యంది.
అప్పుడే ఫోన్ చేసాడు రవి.
ఎలా ఉంది అత్తయ్యకు ..అడిగాడు రవి.
పరవాలేదు, బాగానే ఉంది, ఇప్పుడే హైదరాబాద్ నుండి రాజమండ్రి బయలుదేరాము అంది లత.
ఓకే..అలాగా అన్నాడు రవి .
ఉ.. అంది లత.
నువ్వెలా ఉన్నావు అడిగాడు రవి.
బాగానే ఉన్నాను అంది లత.
ఏంటి అంత బలహీనం గా ఉంది నీ గొంతు , అడిగాడు రవి.
ఎం లేదు, బాగానే ఉన్నాం అంది , తన బాధ బయటపడకుండా.
ఓకే ..బాయ్ పెట్టేసాడు రవి.
మళ్ళీ ఆలోచన లో పడింది  లత.  రవి మంచివాడు, తనని బాగా ప్రేమిస్తాడు అనుకుంటోంది .  ఒకసారి ఓకే,  అనుకున్నాక రవి తో పరిచయం అయింది..  అందువల్ల అతని గురించి ఏ విషయమూ తెలియదు. మంచివాడా , తనను బాగా ప్రేమిస్తాడా, ఎలా చూసుకుంటాడు, పైకి కనబడే మనిషి కాకుండా,  లోపల వేరే మనిషి ఉన్నట్లు , వేరే విధంగా ప్రవర్తిస్తాడా,  ఇవేమీ తెలియదు .  మేనత్త  కొడుకు, పెద్దలు ఇతనితో పెళ్లి అనుకున్నారు , అదీకూడా నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోలేదు, కానీ  ఓకే అనుకున్నారు  ... అంతే.  అతనికీ నా గురించి తెలియదు. తెలుసుకునే టైం రాలేదు,  అవకాశం అంతకన్నా రాలేదు.  ఆలోచిస్తూనే ఉంది , ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు.
నిద్ర లేచే సరికి , ఒక మెసేజ్ వచ్చి ఉంది.  ఎందాకా  వెళ్లారు,  అడిగాడు మెసేజ్ లో కిరణ్.
చెప్పింది లత.
ఎమన్నా తిన్నావా, అడిగాడు కిరణ్.
లేదు, చెప్పింది లత.
ఎక్కడన్నా ఆగొచ్చు గదా, చెప్పాడు కిరణ్.
చూస్తాను, మంచి హోటల్ ఎమన్నా ఉందేమో, అంది లత.
ఒక హోటల్ పేరు చెప్పి, ఇప్పుడు వీళ్లు వెళ్తున్న ప్లేస్ నుంచి ఎంత దూరమో, చెప్పాడు కిరణ్.  ఆ చెప్పడం లో కిరణ్ చూపించే కేర్, మంచి ఫుడ్ దొరికే చోటు చూపించాలి అనే తపన.   లత కి ఎంతో నచ్చింది.
ఎందుకు మీకు మామీద ఇంత అభిమానం,   అడిగింది లత మెసేజ్ లో.
మీరు వచ్చిన కొత్తల్లో అనిపించలేదు కానీ, నువ్వు మళ్ళా హైదరాబాద్ వచ్చినపుడు నాకు హైదేరాబద్ చూపిస్తావా అని అడిగినప్పటి నుంచి నాకు నీ మీద అభిమానం పెరిగింది ... రిటర్న్ మెసేజ్ ఇచ్చాడు కిరణ్.
మీ అభిమానానికి చాలా థాంక్స్ ... చెప్పింది లత.
ఓకే ఓకే,  అన్నాడు కిరణ్ మెసేజ్ లో.
లత వాళ్ళు,  రాజమండ్రి ఇల్లు చేరారు. పరంధామయ్య, మోహన్ కి ఫోన్ చేసి చెప్పాడు ఇల్లు చేరినట్లు. జానకి నెమ్మదిగా కోలుకుంటోంది. నెమ్మదిగా ఇంట్లో మటుకు నడుస్తూ, చిన్న చిన్న పనులు చెయ్యసాగింది. డాక్టర్లు చెప్పినట్లు మందులు వేసుకుంటోంది. లత, కిరణ్ ల మధ్య మెసేజ్ లే పరంపర నడుస్తూనే ఉంది. ఇంటికి వచ్చిన నెల రోజులలో కిరణ్ లత లు ఇద్దరూ ఫోన్ కాల్స్ , మెస్సేజ్ లవల్ల బాగా దగ్గరయ్యారు.  పూర్తి ప్రేమలో పడ్డారనే చెప్పాలి. ఫోన్లు , మెసేజి ల కోసం ఎదురు చూసే పరిస్థితి కి వచ్చారు. ఒక నెల దాటినతర్వాత డాక్టర్ , జానకిని చెకప్ కిరమ్మన్నారు హాస్పిటల్ డాక్టర్లు.
కిరణ్ ను పొగుడుతూ,  తాను కిరణ్ లో ఎం గొప్పతనం చూసిందో, అవన్నీ పొగడ్తలలోకి మార్చ్ మెసేజ్ కిరణ్ కి పెట్ట సాగింది లత.
కానీ ఇవేమీ పట్టించు కోనట్టు  ఉన్నాడు కిరణ్,  లత పెట్టిన మెసేజ్ లకి రిప్లై కూడా ఇవ్వలేదు.  అసలు మెసేజ్లు మధ్యాహ్నం ఒంటి గంట దాకా చూసేవాడు కాదు, ఏవో ఒకటి రెండు మెసేజ్ లకి , పొడి పొడి గ ,  థాంక్యూ , వెల్కమ్ , ఓకే లాంటి మెసేజ్ లు పెట్టసాగాడు.
ఆరోజు సాయంత్రం , కిరణ్ కి లత దగ్గర నుంచి చాలా మెసేజ్ లు వచ్చాయి.  అన్ని పొగడ్తల వరస మెసేజ్ లు వచ్చేసరికి,  కిరణ్ కూడా లతలో ఉన్న ఉన్నత గుణాలు, భావాలు ,  ఆ నాలుగు రోజులూ లత తో గడిపినది కొన్ని నిముషాలే అయినా ,  ఆ గడిపిన సమయం లో ఉన్న మధురానుభూతులు మెసేజెస్  లో చెప్పసాగాడు.
హైదరాబాద్ లో కిరణ్ పరిస్థితి కూడా దాదాపు, ఇంచుమించు అలాగే ఉంది.  ఎప్పుడు లతా గురించే ఆలోచన,   ఇప్పుడు లతా ఏంచేస్తోందో, ఇప్పుడు ఎక్కడుందో అని ఆలోచిస్తూ ఉంటాడు.  తనలో థానే ఏదో మాట్లాడుతుంటాడు.  నవ్వుకుంటూ ఉంటాడు. అదివరకు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పెడితే మధ్యాహ్నం 12 హంతలకు కూడా చూడని మెసేజ్లు ఉన్నాయి. అటువంటిది ఇపుడు రెండు నిముషాలకు ఒకసారి మెస్సగెస్ లు చూస్తున్నాడు, ఆఫీస్ లో ఎవరన్నా గమణిస్తారేమో అన్న ఆలోచన కూడా లేకుండా పోయింది.  ఎదో పరధ్యానం గా ఉంటాడు.  తన పై తాను జాగ్రత్తపడటం ఎక్కువ అయింది. తన హెల్త్, అందం పైన శ్రద్ధ పెరిగింది. తన పై కన్నా , లతా గురించి ఆలోచన ఎక్కువ అయింది . లతా తో లతా హెల్త్ గురించి శ్రద్ధ తీసుకుంటాడు,  బ్యూటీ టిప్స్ చేపట్టాడు. తన ఫ్రెండ్ డాక్టర్ ని అడిగి అవసరమయితే టాబిలెట్స్ కొరియర్  లో  పంపిస్తున్నాడు .
ఒక నెల దాటినతర్వాత డాక్టర్ , జానకిని చెకప్ కిరమ్మన్నారు హాస్పిటల్ డాక్టర్లు.
జానకి కాస్త నడిచే పరిస్థితి లో ఉంది కాబట్టి,  లతా, జానకి ఇద్దరూ జానకి ని డాక్టర్ కు చూపించడానికి  హైదరాబాద్  బయలుదేరారు. పరంధామయ్యకు,  సెలవు దొరకకపోవడం తో.  వీళ్ళు ఇద్దరే బయలుదేరాల్సి వచ్చింది. కిరణ్, మోహన్  అక్కడ హైదరాబాద్ లో చూసుకుంటారు కాబట్టి , పరంధామయ్య కూడా దేర్యం గా భార్య, కూతురు ఇద్దరినీ పంపించాడు.
ట్రైన్ ప్లాట్ఫారం మీద ఆగింది. లతా  ముందు ట్రైన్ దిగి నెమ్మదిగా సూట్ కేసు, దింపుకొని , జానకిని నెమ్మదిగా దింపింది.  లతా కళ్ళు కిరణ్ కోసం వెదక సాగాయి.  కిరణ్ వచ్చాక హలో అనాలా,  జస్ట్ నవ్వి పలకరించాలా,  ఒకవేళ కిరణ్ షాక్ హ్యాండ్ ఇస్తే తాను కూడా అల్లా ఇవ్వాలా,  అమ్మ యెదురుగా అలా షాక్ హ్యాండ్ ఇస్తే బాగుంటుందా. అమ్మ ఎమన్నా అనుకుంటుందో, లేదా మొహమ్మీదే అనేస్తుందో తెలీదు.
కిరణ్ కి ప్లాట్ఫారం మీద లతా, జానకి కనిపించారు.  జానకిని చూసి నమస్తే ఆంటీ ఎలా ఉన్నారో అని పలకరించాడు. లతాం ను చూసి నవ్వాడు, హాయ్ అన్నాడు.
హాయ్ అన్నాడు కానీ , కిరణ్ కి లతను చూడగానే ,  ఒక్కసారిగా కౌగిలించుకుందామా అనిపించింది.  లతకు రవి తో పెళ్లి నిశ్చయమైన విషయం  కిరణ్ కి లతా చెప్పలేదు.  చెపితే కిరణ్ తట్టుకోలేడు. కానీ ఇప్పటి పరిస్థితి లో లతా , కిరణ్ ను వదులుకునే స్థితి లో కూడా లేదు లతా.  కిరణ్ ను చూసి నవ్వింది కానీ, లతకి బుర్రలో ఈ ఆలోచన ఎప్పుడూ ఉంటుంది.  అలాగని కిరణ్ దగ్గర నుంచి కూడా ఇంకా తనను మనస్పూర్తి గా ప్రేమిస్తున్నాడని, పెళ్లిచేసుకుంటాడని క్లారిటీ రాలేదు. ఒకవేళ క్లారిటీ వచ్చినా , తనకు ఆల్రెడీ మారియాజి ఫిక్స్ అయిందని తెలిస్తే తట్టుకోగలడా,  ఈ ఆలోచనల తో సతమత మౌతోంది లతా.
రైల్వే స్టేషన్ నుండి లతా, జానకి , కిరణ్ తో కలసి కిరణ్ వాళ్ళ ఇల్లు చేరారు.  జానకి నడవగలటం చూసి ఎంతో సంతోషపడ్డది మాధవి. అందరూ హాల్ లో కూచుని కబుర్లు చెప్పుకో సాగారు.  వాస్తవానికి, జానకి కి మరుసటి రోజున డాక్టర్ అప్పోయింట్మెంట్ ఉంది. అందుకే  ఈ రోజు తీరికగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఒక గంట తర్వాత ,  లతా, కిరణ్ ఇద్దరూ ఒక ఒంటరి ప్రదేశంలో కలుద్దామని నిశ్చయించుకున్నారు.  ఇపుడు కిరణ్ కి లతా ఎంతో కొత్తగా కనిపిస్తోంది. లతనాది  అన్న ఫీలింగ్ తో ఉన్నాడు,  నువ్వు నాదానివి అన్న ఫీలింగ్ తోనే  లతతో మాట్లాడుతున్నాడు. లతను చూసింది నెలరోజుల తర్వాతనే అయినా, ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నట్టు ఉంది. ఎప్పుడూ లతా గుంరించే ఆలోచనలు. తను అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంకుతూ ఆలోచిస్తూ ఉంటాడు.  రాబోయే రోజుల గురించి కలలు కంటున్నాడు.
కిరణ్ తో మాట్లాడుతోంది కానీ,  తన మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్పాలంటే భయంగా ఉంది లతకు.  ఏమంటాడో, కోప్పడడు, తనను తాను శిక్షించుకునే గుణం కిరణ్ కి ఉంది. కాకపోతే ముందుగా ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. లేదా రవితో పెళ్లి నిశ్చయమయ్యి కూడా నన్నెదుకు ప్రేమించావు అని అడుగుతాడు . అపుడు నేను ఎం చెప్పాలి.  ఈ ఆలోచనలతో సతమత మై పోతోంది లతా.
ఏంటి లతా అలా ఉన్నావు .. అడిగాడు కిరణ్ లతని .
ఎం లేదు అన్నది లతా
కాదు చెప్పు , ఎదో ఉంది, లేకుంటే నువ్వు ఎప్పుడూ సరదాగా ఉంటావు ఇలా ఉండవు అన్నాడు కిరణ్ లతతో.
నేనొకటి చెప్తాను , నువ్వు నన్ను తిట్టావుగా అంది.
చెప్పు ఏమీ అన్నాను లే అన్నాడు కిరణ్.
నావల్ల ఒక పొరపాటు అయింది అన్నది లతా.
ఏంటది అన్నాడు కిరణ్.
నిన్ను ప్రేమించక  ముందే నాకు ఒకరి తో మ్యారేజ్ సెటిల్ అయింది,  అన్నది డైరెక్ట్ గ.
కళ్ళు తిరిగినంత పని అయింది కిరణ్ కు. మైండ్ బ్లాక్ అయింది, తాను ఎం వింటున్నాడు,  వింటున్నది నిజమేనా అని ఆలోచన లో పడ్డాడు.  ఒక్కసారి తాను కట్టుకున్న ప్రేమసౌధం కూలిపోతోందా అనిపించింది.  లతా తండి కాదు, వేరేవాళ్ళ సొంతం, తనే లతాని తప్పుగా అర్ధం చేసుకున్నాడు,  ఆమె చనువు గా ఉన్నంత మాత్రాన తన ఊహలు పెళ్లి దాకా రావాలా,  చ... ఏంటి తనని ఇలా ఉహించు కున్నాను అనుకున్నాడు.
ఏమంటున్నావు లతా , అన్నాడు కిరణ్.
అవును కిరణ్, అతను ఎవరో కాదు మా బావ రవి. మా మేనత్త సావిత్రి కొడుకు , గుంటూరు లో బ్యాంకు ఉద్యోగం.  మా మేనత్త కొడుకు ని అమ్మవాళ్ళు సెలెక్ట్ చేసి నాతో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నేను సరే అన్నాను. నేను ఇష్టపడటం, అతన్ని ప్రేమించడం  అల్లాంటివి ఏమీ లేవు.  అసలు లవ్ అంటేనే నీ పరిచయం తో జరిగింది.  నిన్ను వదిలి ఉండలేను, అతన్ని చేసుకుని నిన్ను వదలలేను అన్నది.
నీకు నేను అంటే అంత ఇష్టం ఉన్నపుడు నువ్వు అతన్ని వదిలి నన్ను చేసుకోవాల్సి వస్తుంది,  అన్నాడు కిరణ్.
నేనంటే నీకు పూర్తి ఇష్టం ఉందా,  నన్ను పెళ్లి చేసుకునేంత ఇష్టం ఉందా ..అడిగింది లతా కిరణ్ ని.
నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను, ఏవేవో ఊహించుకున్నాను. నువ్వు ముందే నాకు ఎందుకు చెప్పలేదు అడిగాడు కిరణ్.
చెబితే నువ్వు నన్ను ఇష్టపడవేమో అని,  అంది లతా.
ఒకరితో పెళ్లి నిశ్చయం, మరొకరితో ప్రేమ, మన సమాజం ఒప్పుకుంటుందా లేదా అన్నది వదిలేసినా, మన తల్లిదండ్రులకు, రవి తల్లి దండ్రులకి పరువు నష్టం ....ఎలా . ఆలోచనలో పడ్డాడు కిరణ్.
సరే ఆలోచిద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని దేర్యం చెప్పాడు కిరణ్ లతకి.  లతా దగ్గర మళ్ళీ ప్రామిస్ తీసుకున్నాడు , లతా తననే పెళ్లి చేసుకుంటుందని.
లతకి కొంత ఊరట గా ఉంది కానీ,  రవి గురించి ఆలోచిస్తే అతనికి అన్యాయం చేస్తోంది అన్న ఆలోచన వస్తోంది.
అతనితో ఏదో బొటాబొటి గా రెండు ముక్కలు  మాట్లాడేసి పెట్టేస్తోంది కానీ మనస్పూర్తి గా కాదు. రవి కూడా లతా సరిగా మాట్లాడటం లేదు అన్న విషయంగమనించాడు కానీ  సీరియస్ గా తీసుకోలేదు.
కిరణ్ జానకి గారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చూపించి , కావలసిన మందులు కొని,  మళ్లా రాజమండ్రి ట్రైన్ ఎక్కేదాకా ఉండి ట్రైన్ ఎక్కించి వచ్చాడు .
ఈ  సమస్య ని ఎలా పరిష్కరించాలి,  అని ఆలోచన లో పడ్డాడు.  
కిరణ్ తన తల్లిదండ్రులు తో ఏ విషయమైనా సామాన్యంగా  రాత్రి భోజనం అపుడు , డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు తన పెళ్లి విషయం , థానే ఎలా ప్రస్తావించాలా అని ఆలోచనలతో సతమతమౌతున్నాడు .
ఈలోగా మాధవి,  పాపం జానకి గారికి ఈ మోకాలు ఆపరేషన్ తో చాలా ఇబ్బందిగానే ఉంది. అన్నీ వాళ్ళ పెద్ద కూతురు లతనే చూసుకోవాల్సి వస్తోంది.  ఆ పరంధామయ్య గారు చూస్తే ఎప్పుడూ ఆఫీస్ పని అనిచెప్పి ,  ఇంటికివచ్చినా ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ ఆడపిల్లల పెళ్లి బాధ్యత ఉంది వీళ్ళ మీద అంది జాలిగా.
అవునురా , నీకు కొన్ని పెళ్లికూతురు ఫోటోలు పంతులుగారు తెచ్చి ఇచ్చారు, నీకు ఇచ్చానుగదా, చూసావా. అడిగింది మాధవి కిరణ్ ను చూసి.
లేదమ్మా , అన్నాడు కిరణ్.
అదేవిట్రా మూడు రోజులైనది వాళ్ళు ఇచ్చి, చూడకపోతే ఎలా. నచ్చకపోతే వెంటనే తిరిగి ఇచ్చేయాలి గాని,  అలా మనదగ్గరే అట్టిపెట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, అన్నది మాదవి కిరణ్ తో.
నాకేవీ నచ్చలేదమ్మా, అన్నాడు కిరణ్.
బాగుంది వరస, అసలు ఫోటోలు చూడకుండానే నచ్చలేదంటే ఎలా, చూసావా అసలు ఫోటోలు,  మళ్ళీ కాస్త రెట్టించి అంది మాధవి.
నీ మనసులో ఎవరన్నా ఉన్నారేవిటి రా, అన్నాడు మోహన్ కిరణ్ తో.
కొంచం తడపడ్డాడు కిరణ్ , ఆ మాట తో,
చెప్పు పరవాలేదు,  అన్నాడు మోహన్ కిరణ్ తో.
ఏవిట్రా విషయం, అంది నవ్వుతూ మాధవి.
ఎం లేదమ్మా,  లతా మీద మీ అభిప్రాయం ఏంటి , అన్నాడు కిరణ్.
ఆ జానకి గారి అమ్మాయేనా,  అంది మాధవి.
అవునమ్మా, అన్నాడు కిరణ్
మౌనంగా వింటున్నాడు మోహన్.
చక్కటి పిల్లే, బాగుంటుంది, మంచి కుటుంబం అంది మాధవి.
పూర్వం  లతా తాతగారు ,  మనకు ఎంతో సహాయం చేశారు,  అన్నాడు మోహన్ .
అలాగయితే వాళ్ళతో మాట్లాడుదాం, పిల్లని అడగటం లో తప్పు ఏముంది,  అంది మాధవి.
ప్రేమించా వేంటిరా ఆ అమ్మాయి లతని,  అన్నాడు మోహన్ నవ్వుతూ.
దాదాపు అలాటిదే నానా, సిగుపడుతూ తలవంచుకుని కొంచం భయంగా, .అన్నాడు కిరణ్.
ఇంకేం పరంధామయ్య నా క్లోజ్ ఫ్రెండ్, నేను అడిగితె కాదంటాడా, అన్నాడు మోహన్.
అవునూ, మరి ఆ అమ్మాయి ఇష్టం ఏంటి , నువ్వు మటుకే ఇష్టపడ్డావా, లేదూ ఆ అమ్మాయి కూడా నిన్ను ఇష్టపడ్డదా,  అడిగింది మాధవి.
ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమే కానీ ఒక ప్రాబ్లెమ్ ఉంది, అన్నాడు కిరణ్.
మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక ప్రాబ్లెమ్ ఏముంటుంది, వాళ్ళ నాన్నను నేను ఒప్పిస్తాను లే , అన్నాడు మోహన్.
నిజమే నాన్న , ఆ అమ్మాయికి వాళ్ళ బావ తో పెళ్లి నిశ్చితార్థం చెయ్యలేదు కానీ, ఖాయం చేసుకున్నారట , అన్నాడు కిరణ్.
ఇదేమి  ఫిట్టింగ్  రా,  మరి నిశ్చితార్థం అయినా పిల్ల నిన్నెలా  ఎలా ఇష్టపడింది, నువ్వు ఎలా  సరే అన్నావు, అన్నాడు మోహన్,
తనూ,  నాకు నిన్ననే చెప్పింది నానా, పెద్దవాళ్ళు చెప్పారని ఒప్పుకుంది, కానీ నాతో పరిచయం అయ్యాక , నన్ను చేసుకుంటాను అంటోంది, అన్నాడు కిరణ్.
ఆ పిల్ల అంత చంచల మైన మనసుతో ఉంటె ఎలారా,  అంది మాధవి కిరణ్ తో.
లేదు లేమ్మా,  ఆ పిల్ల మన ఇంటి కోడలు అయితే ఇంకా ఏముంటుంది చెప్పు,  అన్నాడు కిరణ్.
వాళ్ళు ఆ నిశ్చితార్థం క్యాన్సిల్  చేసుకుంటే గానీ, మనం ఆ సంబంధము ఖాయం చేసుకోలేము, అన్నాడు మోహన్.
అది వాళ్ళు చేసుకోవాలి గానీ , దానికి మనం ఎం చేస్తామండీ అంది మాధవి , మోహన్ ను ఉద్దేశించి.
ఆ అమ్మాయికి , వాళ్ళ నాన్నకు నిశ్చితార్థం క్యాన్సిల్ విషయం చెప్పే దేర్యం లేదు నానా, మనమే ఏదో ఒకటి చేయాలి అన్నాడు కిరణ్ , మోహన్ తో.
సరే, చూద్దాం లే అన్నాడు మోహన్.
అంతటితో ఆ టాపిక్ అక్కడ ఆగిపోయింది.  అందరూ భోజనాలు ముగించుకుని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు.
లతకిరణ్ ల ప్రేమసాగరం ఎపిసోడ్ బాగా స్పీడ్ గా నడుస్తోంది.  ఒకరోజు లతా కిరణ్ కి మెసేజ్ పెట్టింది, " గంటన్నర "  అని. అంటే కిరణ్ కి వెంటనే అర్ధం అయింది, తాను లతా మెసేజ్ లు చూసి గంటన్నర అయ్యిందన్న మాట .  కానీ ఇక్కడ కిరణ్ పరిస్థితి అక్కడ లతా కి తెలియదు. కిరణ్ కి ఆఫీస్ లో వెంట వెంట ఫోన్ లు,  వర్క్లోడ్ హెవీ గా ఉంది, ఒకదాని మీద ఒకటి ఫోన్ కాల్స్,  మరోపక్క మీటింగ్ ఉంది, దానికి డేటా రెడీ చేసుకోవడం, దీంతో సతమతమౌతూ ఉన్నాడు. అప్పటి వరకు , బయటకు వెళ్లి వచ్చాడు, ఏదో ఒక కస్టమర్ విసిట్ ఉంటేను.  సరే లతకి ఇవన్నీ తెలీవు లే అనుకుని, పాపం తాను పెట్టిన మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదని అలిగినట్టుంది,  అనుకుని , తనని రిప్లై మెసేజ్బు ద్వారా, బుజ్జగించడం మొదలుపెట్టాడు.  లతా కొంచం  సీరియస్ గానే ఉంది.  లతకి సర్ది చెప్పడానికి కిరణ్ కూడా కాళ్ళ వేళ్ళ  పడుతున్నాడు.  లతా అలక కొంచం తీవ్రం గానే ఉంది. ఎలా సర్ది చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. లతకి ఫోన్ చేద్దామా , ఫోన్ లో తన మాట తీవ్రత ని బట్టి , అలక తీవ్రత తెలుసుకోవచ్చు అని. కానీ కిరణ్ ఫోన్  , లతా లిఫ్ట్ చెయ్యలేదు.  ఇంకా ఆఫీస్ లో అయినా తప్పదు అని, లతకి రిక్వెస్ట్ పెట్టాడు వీడియొ కాల్ లిఫ్ట్ చెయ్యమని.  లతా చేసింది.  వీడియొ కాల్ లో అర్థం అయింది కిరణ్ కి, లతా అలక లోని తీవ్రత.  లతని కాళ్ళ వేళ్ళ పడి, గడ్డం పట్టుకుని  బ్రతిమిలాడి , దోవకు తెచ్చుకున్నాడు లతని.  దోవకు తెచ్చుకున్నాడు అనడం కన్నా ,లతా శాంతించింది అనవచ్చు.    అప్పుడు  కిరణ్ కి అర్ధం అయింది లతా తనని ఇంత ప్రేమిస్తుందా అని.  తాను అనుకోలేదు, లతా ఇలా హర్ట్ అవుతుందని.  గంటన్నర విరహం తట్టుకోలేక పోయింది అంటే లతా తనని ఎంత ప్రేమిస్తోందో అని.  కిరణ్, లతా అలక లో తన మీద లతకు ఉన్న ప్రేమను చూసాడు. లతా భార్య గా దొరకడం తన అదృష్టం అని ఎన్నోసార్లు  అనుకున్నాడు కిరణ్ .  లతా కూడా కిరణ్ ఒక " గంటన్నర " పాటు తన మెసేజ్ లు చూడక పోయేసరికి తట్టుకోలేకపోయింది.  ఏవేవో  ఊహించు కుని ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళింది.  తాను మెసేజ్ పెట్టేటప్పుడు ఏడుస్తోందా అని అనుమానం వచ్చింది కిరణ్  కి.  తాను బాధపడితే  చూడలేదు కిరణ్.  తాను పెట్టిన మెసేజ్ గంటన్నర దాకా కిరణ్ చుడపపోతేనే తట్టుకోలేక పోయింది లతా.  ఇద్దారూ ఒకానొకరు గాఢం గా ప్రేమించుకున్నారు.  
                                                                               * * *
మోహన్ పరంధామయ్యకు ఫోన్ చేసి మేము ఎల్లుండి ఆదివారము రాజమండ్రి మీ ఇంటికి వస్తాము, ఉంటారా అని అడిగాడు.
ఆ, ఉంటాము , రండి , మాధవి, కిరణ్ ను కూడా పిలుచుకు రా,  అన్నాడు పరంధామయ్య.
ఆ ఆ , వాళ్ళు కూడా వస్తారులే, మళ్ళా సాయంత్రం వెళ్ళిపోతాం,  అన్నాడు మోహన్.
లేదు, లేదు, మీరు ఆదివారం రాత్రి ఇక్కడ  ఉండి,  సోమవారం వెలుదురుగాని,  అన్నాడు పరంధామయ్య.
ఓకే ఓకే  , అలాగే లే,   అని ఫోన్ పెట్టేసాడు మోహన్.
శనివారం ఉదయాన్నే , మాధవి, మోహన్, కిరణ్ ముగ్గురూ హైదరాబాద్ నుండి, రాజమండ్రి బయలుదేరారు. కిరణ్ లతకి మెసేజ్ పెట్టాడు వాళ్ళు బయలుదేరినట్లు .  ఆనందానికి అవధులు లేవు లతకి. పొద్దుటినుంచి లేచి చక చకా అన్ని పనులూ చేసేసుకుంది. జానకి , నెమ్మదిగా నడుస్తోంది కానీ , వంటింట్లో ఎక్కువ సేపు నిలబడ లేకపోతోంది . పని భారమంతా , లతా, ప్రియా లే మోస్తున్నారు. కేవలం కూర్చుని చేసే పనులు చేస్తూ సలహాలిస్తోంది జానకి.
మోహన్ వాళ్ళు రాజమండ్రి చేరేసరికి మధ్యాహ్నం 2 గం అయింది.  ఉదయం 4 గం కి భయలుదేరినా లేట్ అయ్యింది.
రండి రండి,  అని పరంధామయ్య ఎంతో  అభిమానంగా,  మోహన్ వాళ్ళను  లోపలి పిలిచాడు..  అందరూ లోపలి వచ్చి హాల్ లో సోఫాలో కూర్చున్నారు.  
రాజమండ్రి, హైదరాబాద్ లాగ చల్లగా ఉండదు , కొంచం వేడి గానే ఉంటుంది, అన్నాడు పరంధామయ్య మోహన్ తో.
అందరికీ వాటర్ తీసుకొచ్చి , నమస్తే అంది , ఒక్కొక్కరికీ వాటర్ గ్లాస్ ఇస్తూ. కిరణ్ కి వాటర్ గ్లాస్ ఇస్తుండగా , అతను చూసిన చూపు తట్టుకోలేక ఎంతో సిగ్గుపడిపోయింది లతా.
వెనకాలే అందరికీ కాఫీ లు పట్టుకొచ్చింది ప్రియా.  ప్రియతో పాటే నెమ్మదిగా వచ్చి , జానకి అందరినీ పలకరించింది.
ఎలా ఉందండి ఆరోగ్యం ,  అడిగింది మాధవి జానకి ని.
ఎలా ఉన్నారు ఆంటీ ,  పలకరించాడు కిరణ్ జానకి ని.
బాగానే ఉండండి, కొంచం పరవాలేదు , ఇంటివరకు నడవ గలుగుతున్నాను,  చెప్పింది జానకి , మాధవి, కిరణ్ ఇద్దరినీ చూస్తూ.
పదినిముషాలు అందరూ సంతోషం గా కబుర్లు చెప్పుకున్నారు.
ఇంకా అందరూ భోజనాలకు లేవండి, ఇప్పటికే ఆలక్ష్యం అయింది, అన్నాడు పరంధామయ్య .
అందరూ చేతులు కడుక్కుని భోజనాలకు కూర్చున్నారు.  
ఈ రోజు వంట మా అమ్మాయిలు లతా, ప్రియా ఇద్దరూ, కలిసి నాలా భీమా పాకం అన్నాడు.  ఏం భయపడనవసరం  లేదు ,  ఈ రెండు నెలలలో బాగా ఎక్స్పర్ట్ లు అయ్యారు ఇద్దరూ అన్నాడు నవ్వుతూ.
లతకు భయం గానే వుంది వీళ్లకు తన వంట నచ్చుతుందో లేదో అని. ఉప్పులూ, ఖారాలు ఎలా తింటారో తెలిసినా తాను చేసింది నచ్చుతుందో లేదో అని బాగా టెంషన్గా పడుతోంది లతా.
వంట సూపర్ ...అంటూ సైగ చేసాడు కిరణ్, లతకి.
హమ్మయ్య, ... అంటూ ఊపిరి పీల్చుకుంది లతా.
భోజనాలయ్యాక, అందరూ హాల్ లో కూర్చున్నారు.
పరంధామయ్య తో మోహన్ ,  మేము ఒక విషయం నీతో మాట్లాడాలని అనుకుంటున్నాము అని అన్నాడు
ఏంటో చెప్పు అన్నాడు పరనాదమయ్య.
ఎం లేదు , మీ అమ్మాయి లతను మా ఇంటికోడలుగా చేసుకుందామని అనుకుంటున్నాము, నీ అభిప్రాయం ఏంటి  అని నేరుగా విషయం మాట్లాడాడు.
సారీ రా,  మా లతా కి ఇదివరకే , మా సావిత్రి కొడుకు తో సంబంధం కుదుర్చుకున్నాము. అన్నాడు పరంధామయ్య.
సరేలే, అదీ తెలిసింది. తాంబూలాలు పుచ్చుకోలేదటగదా ...అడిగాడు మోహన్.
నా సొంత చెల్లెలు సావిత్రి , బావగారికి , పిల్ల నిస్తానని మాట ఇచ్చాను    అన్నాడు పరంధామయ్య.
ఒక్క విషయం రా, మీ అమ్మాయి లతా అభిప్రాయం కనుక్కున్నవా , అడిగాడు మోహన్.
ఆ రోజే రవిని చేసుకుంటాను అని చెప్పింది , అందుకే  వాళ్లకు మాటిచ్చాము అన్నాడు పరంధామయ్య.
లేదురా, ఇపుడు లతా అభిప్రాయం వేరుగా ఉంది , అన్నాడు మోహన్.
ఉండు పిలుస్తాను , అని లతని పిలువబోయాడు.
వద్దులేరా, అమ్మాయి అభిప్రాయం కిరణ్ తో చెప్పింది, అన్నాడు మోహన్.
అయితే ఇప్పుడేంటి,   అన్నాడు పరంధామయ్య.
అదేంటి ఆలా అంటావు, మా కిరణ్ కోసం,  మేము పిల్లని అడగటానికి వచ్చాము, వాళ్లిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు కూడా,  అన్నాడు మోహన్.
కొంచం ఆశ్చర్యం వేసింది పరంధామయ్యకు,  ఒక్క మాట కూడా లతా నాకు చెప్పలేదేంటి అనుకుంటూ ఆలోచన లో పడ్డాడు.
మళ్ళీ హెచ్చరించాడు మోహన్, పరంధామయ్యను.
అలాకాదు,  మా చెల్లెలు, బావగారికి మా అమ్మాయిని వాళ్లకి ఇస్తామని మాట ఇచ్చాను, వాళ్ళతో కూడా మాట్లాడాలి , ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోడానికి వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళు అంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోను.  వాలు ఎంతో ఇష్టపడి అమ్మాయిని వాళ్ళ కోడలు గా ఖాయం చేసుకున్నారు,  లతా B  ఎడ్ చదువుతానన్నది, లేకుంటే ఈపాటికి పెళ్లి అయిపోవలసింది, అన్నాడు.
నేను అర్ధం చేసుకుంటాను రా , కానీ ఒక్కటి ఆలోచించు, ఆ రోజు అమ్మాయి రవి ఇష్టపడో, యెరికోరో చేసుకోవాలుకున్నది కాదు, మీరు సంబంధం ఏర్పాటుచేశారు, తాను సరే అన్నది.  చేసుకోబోయే వాళ్ళు ఒకరి నొకరు ఏంటో కూడా అర్ధం చేసుకునే అవకాశం కూడా లేదు.  ఇప్పుడు లతా, కిరణ్ లు ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకున్నారు, లతా, కిరణ్  ను బాగా ఇష్టపడుతోంది  కూడా.  మాట ఇచ్చారని, ఇష్టం లేని రవి తో పెళ్లి చేసుకుని జీవితాంతం బాధ పడేకన్నా,  ఇష్టపడిన వారితో పెళ్ళిచేసుకుని , జీవితమంతా సుఖ పడటం మంచిది కదా ఆలోచించు. ఒకవేళ , నీకు అభ్యంతరం  లేకపోతె, మీ చెల్లెలు వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను కూడా వచ్చి మీ బావగారితో మాట్లాడు తాను , అన్నాడు మోహన్.  
ఓకే, ఏదయినా గానీ, లతా తోటి,  మా చెల్లెలు వాళ్ళతో మాటాడి  గానీ , మీ సంబంధానికి నేను ఏ మాట చెప్పలేను,  అన్నాడు పరంధామయ్య.
దానికి మోహన్ ఫామిలీ అందరూ సమ్మతించారు.
                            * * * *                                         * * * *
అదేరోజు సాయంత్రం,  మోహన్ వాళ్ళ సంబంధం , లతా తో మాట్లాడాడు పరంధామయ్య.
ఎమ్మా  ఏంటి మోహన్ వాళ్ళు , వాళ్ళ సంబంధం గురించి చెప్పడం, అని అడిగాడు పరంధామమయ్య.
అవును నాన్నా,  రవి బావ సంబంధం  అప్పుడు ఒప్పుకున్నాను, కానీ నాకు రవి బావ గురించి చిన్నప్పుడు ఆడు కునే వయసులో తప్ప అసలు ఏమీ తెలీదు.  అతన్ని నేను, నన్ను అతను అసలు తెలుసుకోలేదు.  ఈ లోగా నేను కిరణ్ ను గమనించాను.  అతనిలో మంచితనం, మాట తీరు, ఓర్పు, తెలివితేటలు అన్నీ నన్ను నచ్చాయి. ఇవన్నీ రవికి లేవు అనట్లేదు.  కిరణ్ ను నేను , నన్ను కిరణ్ బాగా అర్ధం చేసుకున్నాము.   కిరణ్ గురించి తెలిసి , గమనించి, నేనే కిరణ్ ను అడిగాను , నన్ను పెళ్లి చేసుకోమని.  రవి బావకు  నేను కూడా చెప్తాను. మనసిచ్చిన కిరణ్ తోనే సుఖపడతాను అనిపిస్తోంది . మీరు కూడా  ఆలోచించండి  అంది. తండ్రి తో చెప్పిన మాటలలో తనకు కిరణ్ ని చేసుకోడమే ఇష్టం అని తేల్చి చెప్పేసింది లతా.
సరేలే , బావగారి తో మాట్లాడి చూస్తాను , అన్నాడు పరంధామయ్య..
                                                               * * *
పరంధామయ్య ఆఫీస్ పని తో బాగా సతమతం అవుతున్నాడు. దీనికి తోడు లతా ఈ పెళ్లి సమస్య ఒకటి .  సావిత్రి , బావగారు కృష్ణ తో మాట్లాడాలి. ఢిల్లీ వెళ్లాల్సి వస్తుందేమో,  కానీ తప్పదు, వెళ్లాల్సి వస్తే వెళ్ళాలి.  కానీ  దసరాకి వాళ్ళు  ఇక్కడికే వచ్చారు , కాబట్టి వాళ్ళని  తన తండ్రి ఇంటిదగ్గరనే కలిసాడు.  సావిత్రి, కృష్ణ , రవి ని తన ఇంటికి రెండు రోజులు ఉండేటట్లు రమ్మని పిలిచి,  వాళ్లకు లతా యొక్క అభిప్రాయం చెప్పడం మొదలుపెట్టాడు.
అదేంటన్నయ్య అలా అంటావు , లతా ఎప్పటినుంచో మా కోడలు అనుకున్నాం గా. ఇప్పుడు ఇలా అంటున్నావేమిటి అంది సావిత్రి.
మౌనంగా వీళ్ళు మాట్లాడుతున్నది వింటున్నాడు కృష్ణ.
లేదమ్మా ఇపుడు లతా తన అభిప్రాయాన్ని దృఢం గా చెప్పింది.  వాలు ఇష్టపడ్డ వాళ్లకు ఇచ్చి పెళ్లి చేస్తే కాపురాలు నిలబడతాయి, పిల్లలు కూడా సంతోషం గా ఉంటారు అన్నాడు పరంధామమయ్య.
అప్పుడు టీచర్ ఉద్యోగం కోసం బి ఎడ్ చదవాలని పెళ్లి ఇపుడే వద్దు అని అంది .  తర్వాత వాడెవడితోనో ప్రేమలో పడింది,  అంది సావిత్రి నిష్ఠూరంగా .
ఆలా అనొద్దు సావిత్రి,  అతను కళ్యాణ్ అని నా స్నేహితుడి కొడుకు. మంచి వాడు కూడాను. అయినా నా చెల్లెలి తో  వియ్యం అందుకునే అదృష్టం నాకు లేదు,  అన్నాడు పార్థసారధి.
ఓకే కానీలే బావ,  పిల్లలు వాళ్ళ కి ఇష్టమైన వాళ్ళతో పెళ్ళిచేసుకుంటే నే సంతోషం గా ఉంటారు.  పెళ్లి చేసుకున్నాక భర్త తో సర్దుకు పోయి గుట్టు గా సంసారం నడిపే రోజులు పోయాయి.  ఆడామగా ఇద్దరూ సంపాదించే రోజులు.  ఆలోచనలు, అభిప్రాయాలు మన తరానికి ఉన్నట్లు ఈ తరం వాళ్లకి లేవు.  కొంతవరకు వాళ్ళు కూడా కరెక్టే , ఇపుడు అందరు స్వతంత్ర  భావాలు కలవారు.  ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి , అవగాహన, తెలివితేటలు వాళ్లకు ఉన్నాయి.  అయినా లతను మా కోడలు గా చూసుకునే అదృష్టం మాకు లేదేమో, అందుకె ఇలా జరిగింది అన్నాడు కృష్ణ
రవి ఫోన్ ల మీద ఫోన్ లు చేస్తున్నాడు లతకి. ఇదివరకు లాగ రవి చేసిన ప్రతి కాల్ ,అటెండ్ కావటం లేదు. అటెండ్ అయినా కాల్ కూడా ముక్తసరిగా మాట్లాడుతున్నది.  మనసు కిరణ్ మీద ఉండేసరికి, రవి తోటి మాట్లాడలేక పోతున్నది .  రవికి విషయం తెలిసినట్లుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది లతా.
చెప్పండి బావ అంది లతా రవి తో.
ఏంటి లతా నేనేదో విన్నాను , అన్నాడు రవి.
దీనిగురించి , అంది లతా
మన పెళ్లి గురించి అన్నాడు రవి
సరే ఇక విషయానికి వచౌద్ అంది, తాను కిరణ్ ను ఇష్టపడుతున్న సంగతి రవి కి కొంచం సూటి గానే చెప్పఁలింది లతా.  
రవి కొంచం బాధ పడ్డాడు  కానీ, రవి ది కొంచం పెద్ద మనసు తో, ఆలోచించి , అంతేలే నీకు మనసుకు నాచక పోతే చేసేది ఏమీ లేదు.  కన్నె మా తల్లిదండ్రులు కొంచెం ఉప్సెత్ అవుతారు అన్నాడు రవి  .
లేదు బావ,  నాన్న గారు అత్త తో మాట్లాడుతాను అను చెప్పారు అంది లతా.
అల్ ది బెస్ట్ , చెప్పాడు రవి.
హ్యాపీ గా లతా కిరణ్ ను పెళ్లి చేసుకుంది.కామెంట్‌లు
Unknown చెప్పారు…
కథ చాలా బాగుంది. పాడటం మాత్రమే అని తెలుసు. రచయతగా కూడా రాణిస్తారని ఇప్పుడే తెలిసింది.
Shyamkumar chagal చెప్పారు…
రచన లో మంచి పట్టు ఉంది. శిల్పం కూడా చక్క గా చెక్కి అందమైన కథా వస్తువుగా మార్చారు. మానవ సంబంధాలు మారి పోతూ వుంటాయి అని తెలిసింది. Lot of perfection in writing. రచయిత కు అభినందనలు
పి రామారావు చెప్పారు…
చాలా బాగుంది సార్ కధ.మంచి రచనా శైలి తో కధ ఆద్యంతం ,గ్రిప్పింగ్ గా ఉంది.మీ నుంచి ఇంకా మంచి మంచి కథలను అసిస్తున్నామండి.
Best of lucks.
సత్తి పద్మ చెప్పారు…
కథ, కథనం చాలా బాగుంది. నిజ జీవితంలో పెళ్లి కుదిరిన అమ్మాయి, అదీ దగ్గర సంబంధం క్యాన్సల్ చేసుకుని,వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అంత తేలిక కాదు. కథ పెద్దగా అవుతుందని కొన్ని సంఘటనలు ఎక్కువ వివరంగా రాసి ఉండరు. రాస్తూ ఉండండి.