శివ శివాని పిల్లలం;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
సాంబశివుని పిల్లలం
అంబ భవాని మల్లెలం
శివాయ స్తోత్రం వారలం
శివాని సగోత్రం పోరలం !

శివ నామాన్ని జపిస్తాం
భవసాగరాన్ని తప్పిస్తాం
పుణ్యప్రదంగా జీవిస్తాం
జన్మ ధన్యమని భావిస్తాం !

శివుడంటే మాకు ఎంతో ప్రేమ
ఆ దేవుడుంటే మరింత ధీమా
అందుకే జరిపిస్తాం శివసప్తాహం
పసందుగా తీరుస్తాం మీ దాహం!

అంబా జగదాంబను ఆరాధిస్తాం
జంబలకిడిపంబను నిరోధిస్తాం
దివ్యాంగ జనజాతర జరిపిస్తాం
సవ్యంగా జనాన్ని మేం మురిపిస్తాం

శివరాత్రి జాగరణ చేస్తాం
శివాని అభినేత్రిని చూస్తాం
అన్నపూర్ణ ఆమెని భావిస్తాం
ఆకలి దప్పులను జైయిస్తాం !

మా శివుడే పాలించు ఈలోకాల
ఈ దేవుడే తొలగించు మాశోకాల
స్వయానా ఊదేము మేం బాకాల
ఆయన తొలగించు మా పాపాల 

శివ నామం వింటూ మేం పఠిస్తాం
శివోహం అంటూ వెంటనే ఓటేస్తాం
అందరి శివ సామూహిక స్మరణం
సుందర శివ శంకర నాగాభరణం !

అంబ జగదంబ మా కుల దైవం
నిజంగా తెలిపేదే మా ఈ వైనం
బేజారే లేకుండా తొలగులే వైనం 
బీజాక్షర వెలుగులే ఇక మా సైన్యం

శివపార్వతులే ఆది దంపతులు
అందిస్తారులే వారు సంపదలు
శివనామ అమృతాన్ని  గ్రోలుతాం
శివ సామ్రాజ్యాన్ని ఇక ఏలుతాం !


కామెంట్‌లు