భారతీయుడు అన్న ప్రతి జీవి ఈ ప్రకృతి ప్రసాదించిన చెట్టు పుట్ట నుంచి ప్రతి వస్తువు పైన భక్తిని పెంచుకుంటాడు ఎదుటి వ్యక్తిలో కూడా దైవ స్వరూపాన్ని చూడగలిగిన వాడు. కొంతమంది మీరు దేవుని చూస్తారు మీకు ముక్కోటి దేవతలు అని ఏద్దేవా చేస్తారు. ఆ రోజు దేశంలో మూడు కోట్ల మంది ఈ రోజు 150 కోట్ల మంది. ప్రతి వ్యక్తి ఒక దేవతా స్వరూపమే చెట్టును ఎందుకు పూజిస్తారు? నీకు ప్రాణవాయువు నిచ్చి నీ ప్రాణాన్ని నిలబెడుతుంది. నీవు విడిచే బొగ్గుపులుసు వాయువును కాలుష్యం లేకుండా తనలో నింపుకుంటుంది. తాను సజీవంగా ఉన్నంతవరకు అలా చేస్తూనే ఉంటుంది. నీవు కనీసం నీరు కూడా పోయవు తన వేళ్ళ ద్వారా భూమిలో నుండి నీటిని తీసుకుంటుంది దాని ఆయువు తీరిన తరువాత ఎండిపోయి నీకు కట్టెపుల్లలుగా ఉపయోగ పడుతుంది. ఇల్లు కట్టుకోవడానికి సహకరిస్తోంది. ప్రత్యేకించి చేదుగా ఉన్న వేప చెట్టు గాని, ఉసిరి చెట్టు గాని, ముషిడి (ముష్టి) చెట్టు కాని నీకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. ఇంత సహకరిస్తున్న ఆ చెట్లను పూజించడానికి నీకు ఏమిటి అభ్యంతరం. తోడ పుట్టిన తమ్ముడు కూడా సహకరించక పోగా వారి నుంచి లబ్ధి పొందాలని మాత్రం చూస్తూ ఉంటారు. కరడుగట్టిన ఆ గుండెను కరిగించడం ఎవరివల్లా కాదు అలాంటి వారు ఈ లోకంలో ఉంటేనేమి, పోతే నేమి. అందుకే వేమన ఈ చెట్లకు అంత ప్రాముఖ్యత నిచ్చి విశేషంగా చెప్పటం.
దేవతగా వృక్షం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి