కలిమి లేములు కావడి కుండలు అనే ఒక పాట చరణం జీవితాన్ని ఎంత అధ్యయనం చేయకపోతే ఆ మాట అనగలడు కవి. కావిడి మోసే వ్యక్తి కావిడి రెండు పక్కలా వుట్లు పెట్టుకొని దానిలో పదార్థాన్ని పెట్టి రెండు బరువులు సమానంగా ఉండేలా చూసి దానిని మోసుకుంటూ వెడతాడు. మనుషులలో బీదవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు కష్ట పడి ధనార్జన చేసే వాళ్ళు ఎలా ధనవంతులు అయ్యారు. వారికి ధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది దానికి కర్త ఎవరు? వారి తండ్రి తాత లేక వారి ముత్తాత పెద్దలు సంపాదించి ఇచ్చిన ధనాన్ని అనుభవిస్తున్న వారికి దాని విలువ తెలుస్తుందా ఏ పని లేకుండా అర్థం పర్థం లేని ఖర్చులతో అన్నిటిని వాడుకుంటూ ఏ కార్యానికి ఖర్చు చేయాలో, దేనికి చేయకూడదో అన్న విచక్షణ కూడా లేకుండా ప్రవర్తించేవారు. కొండంత ఉన్న ఆస్తి మొత్తం ఖర్చు చేస్తారు. అది అయిన తర్వాత మళ్లీ కష్టంతో దానిని పూరించగలరా? ఆ జీవిత కష్టాలు తెలిస్తే కదా పూరించడానికి కనుక అంత ధనవంతులు, కోటీశ్వరులు కూడా తినడానికి మెతుకులు వెతుక్కునే బీద వానిగా మిగులుతారు. అదే బీద కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు తాను తన కుటుంబ సభ్యులతో కలిసి కాయకష్టం చేసి ఏ రోజుకా రోజు కూలి తెచ్చుకొని హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాడిది ఎంత సుఖవంతమైన జీవితం. నా స్నేహితురాలు కమల తాను వంద కోట్లకు అధిపతి ఆమె తండ్రి వెయ్యి కోట్లకు అధిపతి ఆమెను నేను ఒక రోజు గమనించాను కాలేజీకి వెళ్ళే రోడ్డు పక్క కొండ రాళ్ళు కొట్టుకుంటూ జీవిస్తున్న వారి దగ్గర ఆగింది. వారు భోజనం చేస్తున్న సమయం అది. గృహిణి అన్నం కలిపి మిగిలిన వారందరికీ ముద్దలు పెడుతోంది ఎంత ఆనందంగా ఎంత హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఎర్రటి ఎండలో మాడుతూ వున్నా దానిని లెక్క చేయకుండా చమటలు కారుతున్న దానిని పట్టించుకోకుండా ఎంత సుఖంగా ఉన్నారు నేను మా నాన్న గారితో కలిసి భోజనం చేసి ఎంత కాలమైంది. ఒకటి రెండుసార్లు నాకా అవకాశం వచ్చినా ఏదో ఫోను రావడంతో మళ్లీ వెళ్లిపోతాడు ధనవంతులు వారా నేనా అనేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవడు ఉన్న వాడు? ఎవడు లేనివాడు? వ్యాస వాల్మీకుల నుంచి శంకరాచార్య వరకు చెప్పిన మిథ్యా వాదం ఇంతకన్నా గొప్పదా ? వేమన ఎంత గొప్పగా ఆలోచించి, పరిశీలించి ఈ పద్యాన్ని వ్రాసి ఉంటాడు. అది తలుచుకుంటే ఎవడు భోగిగా ఉండి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలను అనుభవించిన తరువాత యోగిగా మారిన మహానుభావులకు ఈ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఎలా వున్నదయినా తెలుస్తోంది. దాని మానసిక విశ్లేషణ చేయగలిగిన మేథ వారికుంటుంది అని రుజువు చేసిన వారు ప్రాతః కాలంలో స్మరించుకోవాల్సిన యోగి, జన భాషలో రాసిన యోధుడు మన వేమన అంటే అతిశయక్తి కాదని నా భావన. ఆ పద్యాన్ని చూడండి.
"కలిగినట్టె యుండు కలుగక యుండును
మరియు లేకపోవు తిరిగి కలుగు
కలిమి నెచట చూడ గారడి యనవచ్చు..."
"కలిగినట్టె యుండు కలుగక యుండును
మరియు లేకపోవు తిరిగి కలుగు
కలిమి నెచట చూడ గారడి యనవచ్చు..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి