చెట్టుకింద జాతకం!అచ్యుతుని రాజ్యశ్రీ

 చిలకజోస్యం అంటూ ఆజాతకాలు చెప్పేవాడు చెట్టుకింద  రోజూ మకాం వేస్తాడు. మిట్టమధ్యాహ్నం ఆవీధిఅంతా తెరుచుకున్న షాపులతో మహా సందడి! ఉరుకులు పరుగుల జనం ఓసారి  చెట్టుకింద బిచాణావేసిన తిప్పయ్యను అలా చూస్తూ సాగిపోతారు.కొందరు కాలక్షేపానికి అతనిదగ్గరికి చేరుతారు. బాటపై పాత బట్టలు ఇనుప చెక్కసామాన్లు చిరుతిళ్లు అమ్మేవారు!ఓహ్!సందడే సందడి!అసలు తను జాతకం చెప్పాలని ఎన్నడూ అనుకోలేదు. చిలుక జాతకం చెప్పేవాడు తన ఊరికి ఓనెల పోతూ అప్పగించాడు చిలుకను జాగ్రత్తగా తను వచ్చేదాకా చూడమని!తాత తండ్రి పొలం పనులు చూస్తూ జీవితం గడిపారు. అప్పట్లో ఒళ్లు వంగక తండ్రి చెప్పిన మాటవినక ఏడో క్లాసుతో చదువుకి మంగళం పాడి పట్నం పారిపోయాడు.
తిప్పయ్య హోటల్ లో కొన్నాళ్ళు  చాకిరీ చేసి"బాబోయ్!నావల్ల కాదు" బైట పడ్డాడు.కాషాయదుస్తులు  తలపాగా రుద్రాక్షలు ధరించి  గడుల పుస్తకం చిలుకతో కొత్త అవతారం ఎత్తాడు తిప్పయ్య! తెలివిగా నక్కజిత్తులు ప్రయోగించి మాట్లాడటం నేర్చుకున్నాడు. తనకి పరిచయం ఐన  నలుగురితో  కొత్త ధంధా ప్రారంభించాడు.అందరూ చూస్తుండగా తనస్నేహితుడి చెయ్యి చూస్తూ"నీకు ఫలానా కష్టం వస్తే  పారిపోయి వచ్చావు.హోటల్ పనివాడిగా ఉన్నావు" అని అతని దగ్గర 10రూపాయల ఫీజు వసూలు చేసేవాడు.ఇలా ముగ్గురు స్నేహితుల గతించిన వారి మంచి చెడులు చెప్పి  కొత్త గా వచ్చే జనానికి నమ్మకం కలిగించేవాడు.ఆనలుగురూ  ఆగల్లీవారి వివరాలు సేకరించి ఇతని చెవిలో ఊదేవారు.తిమ్మయ్య గొప్ప జ్యోతిష్యపండితుడని వారు ప్రచారం చేయటంతో జనం క్యూలు కడుతున్నారు. నలుగురు  తన శిష్యులని వారి కి అన్ని వివరాలు చెప్పమని తను మీనమేషాలు లెక్కపెడుతున్నాడు. అంతే!వెర్రి జనం ఈఐదుగురి మాటలకి బోల్తా పడ్డారు. తాయెత్తు విభూది నల్లదారాలు కట్టడం  సాంబ్రాణి ధూపాల పేరుతో రోజుకి రెండు వేల సంపాదన! శిష్యులుగా నటించేవారికి తలా300!ఇలా తిమ్మయ్య మూడు రోజుల కోసారి మకాం మారుస్తాడు. ఒకేచోట ఉంటే తమగుట్టు రట్టవుతుందని వారికి  తెలుసు.మరి ఇలాంటి వారిని  నమ్మకూడదు అని టీచర్ చెప్పితే  పిల్లలు నమ్మరు.అందుకే  ఆబడివారు ఐదోక్లాస్ నించి  పిల్లలకు  ఇలాంటి విషయాలలో అవగాహన కలిగిస్తారు.కొత్త వారు పిలవగానే వెళ్లరాదని ఇంట్లో చెప్పి ఎక్కడికైనా  వెళ్లి  చెప్పిన టైంకి ఇల్లు చేరాలని ప్రతినెలా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సదస్సు నిర్వహిస్తారు.చదువు కన్నా ముఖ్యమైన విషయాలు చెప్పి చైతన్యం కలిగిస్తున్న ఆబడికి ఉత్తమ బడి అని సత్కరించారు అపల్లెవారు.జాతకాలవారు "మంచే జరుగుతుంది. బ్రహ్మాండంగా ఉంది జాతకం!కానీ..." అని పరిహారాలపేరుతో  డబ్బు గుంజటం సర్వ సాధారణం ఐంది.కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని  మనం అప్రమత్తం గా ఉండాలి సుమా!షిరిడీ బాబా అదే చెప్పాడు "జాతకాలు పరీక్షఫెయిల్ పాస్ అని చెప్పవు.మీకృషి మీరు చేస్తూ నాపై నమ్మకం ఉంచండి." ఇలా మనం దైవంపై నమ్మకం ఉంచి సాగాలి.దొంగ సాధుసన్యాసుల ఎడ అప్రమత్తం గా ఉండాలి🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం