అతడు
శాంతి కాముకుడు
విశ్వ మానవ ప్రేమికుడు
సమ సమాజ స్వాప్నికుడు
నిరంతర అక్షర శ్రామికుడు
నవ రసాల భావుకుడు
నిఖార్సయిన నిస్వార్థ మానవుడు
అసలైన సమాజ సేవకుడు
నిత్య సత్యాన్వేషకుడు
నిజానిజాల విశ్లేషకుడు
సత్య సందేశకుడు
మార్గ నిర్దేశకుడు
విచక్షణా జ్ఞాన ఉపదేశకుడు
ప్రపంచానికే ప్రధానోపాధ్యాయుడు
అతని లక్ష్యం ఒక్కటే!
శ్రేయో రాజ్యాన్ని స్థాపించడం
అతని గమ్యం ఒక్కటే!
అజ్ఞానుల్లో విజ్ఞాన జ్యోతులను వెలిగించడం
అతని ధ్యేయం ఒక్కటే!
మూర్ఖుల్లోని అజ్ఞానాంధకారాన్ని తొలగించడం
అతని అభిలాష ఒక్కటే!
నిరాశావాదుల్లో నిత్య చైతన్యాన్ని కలిగించడం
అతని ఆకాంక్ష ఒక్కటే!
ఈ జగతిని ప్రగతి బాటలో పయనింపజేయడం
అతని ఆశ(య౦) ఒక్కటే!
సకల జనులు సుఖ శాంతులతో జీవింపజేయడం
అతడు...
ప్రజలకు , ప్రభుత్వానికి మధ్య వారధి!
పేద ప్రజల పక్షాన నిలిచే సారథి!!
అతడే..
అసలు సిసలైన కవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి