సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 స్వాతంత్య్రం ...సౌహార్థ్రం 
  ******
స్వాతంత్ర్యం గురించి తెలిసిన ప్రతి వారికి సౌహార్థ్రం గురించి కూడా తెలియాలి.
భారత దేశమంతటా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం.
ఈ వేడుకల వెనుక ఎంత మంది వీరుల రుధిరం చిందిందో, ఎంత మంది యోధుల ఆత్మార్పణ జరిగిందో, దేశమాతను దాస్య శృంఖలాల నుంచి విడిపించేందుకు  ఎంత మంది  వీరోచిత సాహసాలుచేశారో...
చరిత చాళ్ళను తడిమితే ప్రతి మట్టి రేణువు చెబుతుంది.
 చరిత్ర పుటల్లో రుధిరాక్షరాలతో లిఖించబడిన అమరులైన యోధుల గాధలు చెబుతాయి.
వారందరి ఆత్మార్పణ ఫలం ఈ స్వాతంత్ర్యం.
నేడు  మనమంతా స్వేచ్ఛా ,స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నాం
 కానీ,వారి త్యాగాల బాటలో ఎంత మంది నడుస్తున్నాం?
.ఆ మహనీయులను గుర్తుచేసుకుని ,ఎంత మందిమి వారి ఔన్నత్యాన్ని మనసులో నింపుకుని, సౌభ్రాతృత్వ,సౌహార్థ్ర పరస్పర సహకారంతో జీవిస్తున్నాం.వారి పోరాట స్ఫూర్తిని  తీసుకుని  నిస్వార్థంగా , నిజాయితీగా,సమత మమత భావనతో బతుకుతున్నాం అనేది ఆలోచించాలి.
ఈ వజ్రోత్సవ  వేడుకల్లో మనల్ని మనం ప్రశ్నించుకుందాం...
మన దేశ కీర్తి ప్రతిష్టలు ఆకాశం అంచులు దాటి,విశ్వమంతటా వ్యాపించేలా స్వార్థ రహితంగా,సౌభ్రాతృత్వ,సౌహార్థ్ర భావనతో నడుద్దాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు