భారత స్వాతంత్ర్య అమృతోత్సవములు;-జి.లింగేశ్వర శర్మ
 సీసం
అంబరమంటెనుసంబురములునేడు
భారతావనియంతపండుగవలె
స్వాతంత్ర్యవజ్రోత్సవాలవేడుకలనే
జరుపుకొనెడిశుభతరుణమందు
బానిస సంకెళ్ళ బంధవిముక్తికై
స్వాతంత్ర్య సాధనసమరమందు
పోరునుసలిపినవీరుల త్యాగాల్ని
స్మరియిస్తుముందుకుసాగవలెను
తే.గీ
అన్నిరంగాలయందునయద్భుతముగ
సాగిపోవుచుభారతజాతినింక
వెలిగిపోవాలిమేటిగవిశ్వమందు
శాంతి సామరస్యములతోసంతసమున

కామెంట్‌లు