సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
సాధ్యం... సామర్థ్యం
  *****
ఏదైనా సాధ్యం కావాలంటే అది వ్యక్తి యొక్క ఓపిక, వివేకం విచక్షణ ,కృషి,పట్టుదల,తపనతో పాటుగా సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.
సాధ్యం కాని వాటి కోసం  సామర్థ్యాన్ని ఎంతగా పెట్టుబడి పెట్టినా ,కొండతో పొట్టేలు ఢీ కొట్టినట్లు ఉంటుంది.
ఏదైనా కార్యాన్ని మొదలు పెట్టే ముందు సాధ్యాసాధ్యాలతో పాటు దాని వల్ల ఒనగూరే మంచి చెడుల వివేచన చేయాలి. పావలా పనికి రూపాయి ఖర్చు పెట్టినట్లు, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందం కాకూడదు.
తలపెట్టిన పని తప్పకుండా సాధ్యం అవుతుందనే నమ్మకం ఉంటేనే ప్రారంభించాలి.
ఆ పని విజయవంతం అయ్యేందుకు శక్తి వంచన లేకుండా ,లోలోపలి సామర్థ్యానికి పదును పెట్టుకుంటూ నమ్మకంతో సాగిపోవాలి.
అప్పుడే వ్యక్తిగా సామర్థ్యం ఏమిటో తెలుస్తుంది.
సామర్థ్యానికి సరైన దిశానిర్దేశం చేస్తే సాధ్యం కానిది ఏది లేదనేది అర్థమవుతుంది. 
ప్రభాత కిరణాల నమస్సులతో 


కామెంట్‌లు